Intinti Gruhalakshmi : ’ఇంటింటి గృహలక్ష్మి’ ఈరోజు ఎపిసోడ్ సూపర్.. లాస్యకు దొరికిన ఛాన్స్.. తులసి, అనసూయలపై రెచ్చిపోయిన అంకిత..!

Updated on: February 4, 2022

Intinti Gruhalakshmi Feb 4 Episode Today : బుల్లితెర సీరియల్ గా ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అందులో తులసీ, లాస్యల ఇంటిపోరు ఆసక్తికరంగా సాగుతోంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ లాస్య తులసి అడుగడుగునా దెబ్బకొట్టేందుకు పన్నాగాలు పన్నుతూ అవకాశం దక్కినప్పుడుల్లా రెచ్చిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ లోనూ అదే తంతు కొనసాగింది. తులసిని ఏ రకంగా ఇరికించాలా అని ఆలోచిస్తున్నా తరుణంలో లాస్యకు అంకిత ఒక పావులా కనిపించింది. వెంటనే అంకితను రెచ్చగొట్టింది. అంతటితో ఆగలేదు.. అంకితతో మొదలైన ఈ రచ్చ.. గాయత్రి వరకు చేరేలా చేసింది లాస్య.. ఇదంతా ఈరోజు జరిగిన ఎపిసోడ్.. రేపటి ఎపిసోడ్ లో గాయత్రి ఇంటికి వచ్చి ఏం చేస్తుందో చూడాలి..   

ఈ సీరియల్ విషయానికి వస్తే.. తులసి.. ఈ పేరు వింటే చాలు.. లాస్యలో ఎక్కడలని కోపం.. ఉక్రోశం.. ఎలాగైనా దెబ్బకొట్టాలనేది తపన.. అందుకోసం వచ్చిన ఎలాంటి అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలని చూస్తుంటుంది. అది అంకిత రూపంలో కనిపించింది. వెంటనే రెచ్చిపోయింది. అంకితకు తులసిపై బాగా ఎక్కించింది. అంతే.. అసలే ఆ కోపంతో రగిలిపోతున్న అంకితకు అనసూయ చివాట్లు పెట్టింది. ఇంట్లో పనిచేయడం లేదు.. తులసిని చూసి నేర్చుకోమ్మని అంటుంది.

అంతే.. అప్పటికే ఫైర్ మీదున్న అంకిత.. కోపం ఆపుకోలేకపోయింది. వెంటనే తనలో రగులుతున్న ఉక్రోశాన్ని అనుసూయపై చూపించింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన తనను వెళ్తుండగా అనసూయ ఆపడంలో ఆమెలో అప్పటివరకూ దాచుకున్న కోపాన్ని అంతా ఆమెపై వెల్లదీసింది. ఇంతలో అక్కడికి వచ్చిన లాస్య.. మరింత మిరియాలను దట్టించింది.

Advertisement
Intinti Gruhalakshmi Feb 4 Episode Today 
Intinti Gruhalakshmi Feb 4 Episode Today

అమ్మమ్మ.. తులసి అంటీతో నన్ను పోల్చవద్దు : 
అనసూయను చెడమడ తిట్టేస్తున్న అంకిత.. తనను తులసి అంటీతో పోల్చవద్దని గట్టిగా చెబుతుంది. అంతలో ఉద్యోగానికి వెళ్లిన తులసీ వెనక్కి వచ్చి నిలబడుతుంది. తులసిని చూసి ఒక్కసారిగా కంగుతిన్న అంకిత కాసేపు సైలంట్ అవుతుంది. సీన్ లోకి ఎంటర్ అయిన లాస్య అంకితను మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించగా తులసీ చివాట్లు పెడుతుంది. పెద్దవాళ్లు చెప్పిన మాట వినడం నేర్చుకోవాలని, ఉద్యోగం చేసే చోట ఇలానే బాస్ మందలిస్తే పనిచేస్తావా లేదా వారితో గొడవ పడతామా అని గట్టిగానే మందలించింది తులసీ.

దాంతో.. నాకు పని చేయాలనే ఉంటుందని, నాకు పని రాదని, నెమ్మదిగా నేర్చుకుంటానని అంకిత సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అందరూ తులసి అంటీలా చేయాలంటే చేయలేరుగా ఎదురు సమాధానం చెబుతుంది. పెద్దవాళ్లు అయినా ఆఫీసులో బాస్ అయినా చెప్పేది తప్పు అయినా రైట్ అయినా కొన్నిసార్లు సంయవనంగా ఉండాలే తప్ప వారిపై గొడవపడటం సరైనది కాదనే విషయాన్ని తులసి గట్టిగా చెప్పడంతో అంకిత చిన్న బుచ్చుకుంటుంది. అక్క్డడి నుంచి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత తులసికి భజన చేసే పరందామయ్య వచ్చి ఎప్పటిలాగే ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. నేను ఓడిపోయాను మావయ్యా.. నేను ఓడిపోయాను అని తులసీ అంటుంది.. అంకితను అత్తలా కాదు.. అమ్మలా చూసుకుంటాను అని చెప్పాను.. తన బాధను చూస్తుంటే ఓడిపోయాననే అనిపిస్తోంది. సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చింది మామయ్య అని అంటుంది తులసి. అంకితకు కోపంలో న్యాయం ఉంది కదా.. తప్పునాదే అని తప్పు ఒప్పుకుంటుంది తులసి. పరందామయ్య.. తప్పు నీది కాదమ్మ.. పరిస్థితులే అలా తీసుకొచ్చాయని సర్దిచెబుతాడు.

Advertisement

రేపటి ఎపిసోడ్ మాములుగా ఉండదు.. డోంట్ మిస్.. 
అక్కడితో కట్ చేస్తే.. ఇదంతా రేపటి ఎపిసోడ్‌లో జరిగే సీన్ మరింత రసవత్తరంగా ఉండనుంది. లాస్య దొరికింది కదా ఛాన్స్ ఈ చిన్న విషయాన్ని అంకిత తల్లి గాయత్రికి ఫోన్ చేసి ఆమె చెవిన వేసింది. ఇక జరగాల్సింది ఆమె చూసుకుంటుందిలేనని లాస్య భావిస్తుంది. లాస్య మాటలతో రెచ్చిపోయిన గాయత్రి.. ఆవేశంగా ఇంటికి వచ్చేస్తుంది. తులసీని, అనసూయలపై కారాలు మిరియాలు నూరేస్తుంది.

Intinti Gruhalakshmi Feb 4 Episode Today
Intinti Gruhalakshmi Feb 4 Episode Today

నా బిడ్డను రాచిరంపాన పెడుతున్నారంటూ కడిగిపారేస్తుంది. అయినా నా కూతురితో పనులే చేయించడానికి మీరు ఎవరు? అంటూ మండిపడుతుంది. నా కూతుర్ని హింసపెడుతున్న మీరందరిని అరెస్ట్ చేయిస్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది గాయత్రి.. అప్పుడు తులసి ఎలా ఆమెకు సర్దిచెబుతుంది.. గాయత్రి అన్నంత పనిచేస్తుందా లేదో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సేందే మరి.

Read Also : Karthika Deepam : మోనిత, భారతిలు వస్తున్న పార్టీకి వంటలు చేయడానికి ఒప్పుకున్న వంటలక్క!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel