Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Intinti Gruhalakshmi : పోలీస్‌ స్టేషన్‌లో తులసి, అభి… ఈ గండం గట్టక్కెంచే నాథుడెవరు..?

Intinti Gruhalakshmi Today Episode Feb 18 : బుల్లితెరపై ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి.. ఈ డైలీ సీరియల్‌ ప్రతిరోజు ఊహించని మలుపులతో వీక్షకులలో ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. మరి ఈ రోజు ప్రసారం కానున్న ధారావాహిక 559 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఓ లుక్కెయ్యండి. అభి ఈజీ మనీ కోసం తప్పుదారి పడుతున్నాడని తులసి అంకిత అనుకున్నట్టుగానే అభి ఎవ్వరూ ఊహించని విధంగా 10 లక్షలు అప్పు చేయడం.. ఆ డబ్బులు ... Read more

By Ramesh Babu

Published on: February 18, 2022 9:49 AM

Updated on: February 18, 2022 8:21 PM

gruhalakshmi serial latest episode

---Advertisement---

Intinti Gruhalakshmi Today Episode Feb 18 : బుల్లితెరపై ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి.. ఈ డైలీ సీరియల్‌ ప్రతిరోజు ఊహించని మలుపులతో వీక్షకులలో ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. మరి ఈ రోజు ప్రసారం కానున్న ధారావాహిక 559 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఓ లుక్కెయ్యండి.

gruhalakshmi serial latest episode
Intinti Gruhalakshmi Today Episode Feb 18

అభి ఈజీ మనీ కోసం తప్పుదారి పడుతున్నాడని తులసి అంకిత అనుకున్నట్టుగానే అభి ఎవ్వరూ ఊహించని విధంగా 10 లక్షలు అప్పు చేయడం.. ఆ డబ్బులు తీసుకున్న తన ఫ్రెండ్ మనోజ్ మోసం చేయడం.. అభి మనోజ్ నీ మోసం చేశావని అడిగే ప్రయత్నంలో.. తోపులాట చోటుచేసుకుని మనోజ్‌ని పక్కకు తోయగా అది కాస్తా హత్యగా చిత్రీకరించడం జరిగిపోయాయి.. ముందు నుంచి మామ్ చెబుతూనే ఉంది కానీ నేనే వినలేదని అభి మనసులో చాలా బాధ పడుతూ ఉంటాడు.

ఈ కష్ట సమయంలో తనకు సహాయం చేయగలిగేది అమ్మేనని తెలుసుకుని.. ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చి తన ఫోన్లో నుంచి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. అభి గొంతు గుర్తు పట్టి తులసి నాన్న అభి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు మామ్.. నేను చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు మామ్ అని అడుగుతాడు. నువ్వు నిజంగానే తనని చంపే ప్రయత్నం చేశావా అని అభిని తులసి అడుగుతుంది.. నేను చెయ్యలేదు మామ్‌ అంటాడు అలా అయితే నువ్వేమీ కంగారు పడకు నీకు ఈ అమ్మ ఉంది. ఏం చేసినా రక్షించుకుంటుంది అని అభికి ధైర్యం చెబుతుంది.

Intinti Gruhalakshmi Today Episode Feb 18 : ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే..

నందు లాస్య రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతారు. కోపం వచ్చిన వాళ్ళ అమ్మానాన్న నందుకి చివాట్లు పెడతారు. మీనాన్న ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నువ్వు ఇలాగే పట్టించుకోకుండా వదిలేసావని.. ఇప్పుడు అభికి ఇలా జరిగితే నువ్వు పట్టించుకోవడంలేదని.. ఇంత జరుగుతుంటే ఎంతసేపటికి కఠినంగా  ఎలా మారిపోయావని నందు వాళ్ల అమ్మ అంటుంది. దానికి అభిని ఎలా ఈ గండం గట్టెక్కించాలా అని లాయర్‌ సలహాలు తీసుకుంటున్నాను అంటాడు నందు. అంతకంటే పెద్ద గండం శశికళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. లేకపోతే మనం అందరం నడిరోడ్డు మీద పడతాం.. ముందు దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నా అని చెబుతాడు.

ఇక అభిని వెతకడం కోసం వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. తులసి అభిని అడిగి ఏం జరిగిందో తెలుసుకునే లోపే పోలీసులు వస్తారు. అభి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా నువ్వు మాకు దొరికేవరకు మీ అమ్మను స్టేషన్‌లోనే ఉంచుతామని పోలీసులు చెబుతారు.. ఆ ఎస్సై తులసితో నువ్వు ఒక్కదానివే వచ్చావా ఏంటి నీ మొగుడు ఏడి అని అడుగుతాడు. నాకు భర్త లేడని తులసి చెబుతుంది. వీడికి తండ్రి ఎవరో కూడా తెలీదు అని చాలా నీచంగా మాట్లాడతాడు.. కోపం వచ్చిన అభి ఎస్సై కాలర్ పట్టుకుంటాడు.. దాంతో సీన్ ఊహించని విధంగా తయారవుతుంది. ఇంక ఎస్సై అభిని ఏం చేయనున్నాడు..!? తులసి, అభిలను కాపాడటానికి నందు ఏం చేయను ఉన్నాడో తరువాయి భాగంలో చూడాలి.

Read Also : Intinti gruhalakshmi: అభి విషయంలో తులిసే ముద్దాయి… పోలీసులకు చిక్కిన అభి..!

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే