Intinti gruhalakshmi Feb 24 Today Episode : అభిని కాపాడుకోవడం కోసం తులసి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ రాత్రిపూట ఎస్ఐ ఉండే బార్‌కి వెళ్లి తన కొడుకుని తనకు చూపించమని వేడుకుంటుంది. తల్లిగా బిడ్డను కాపాడుకోవడానికి ఓ అమ్మ చేయాల్సిన ప్రయత్నాలన్నీ అలసిపోకుండా చేస్తుంది. అయినా తన కుటుంబం మాత్రం తననే దోషిని చేసి నిందిస్తుంటారు. తులసికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వకపోగా తనదే తప్పని వారిస్తుంటారు.

ఆ రాత్రంతా తులసి అభి కోసం ఏడుస్తూనే ఉంటుంది. ఎలాగైనా రేపు ఆ ఎస్సై నిన్ను నా ముందు నిలబెట్టేలా చేస్తాను అభి అంటూ కుమిలిపోతుంది. మరునాడు ఉదయాన్నే.. అనసూయతో.. అత్తయ్యా.. నేను బయటికి వెళ్తున్నాను.. మీరు నాకోసం ఎదురు చూడకండి ఎప్పుడొస్తానో నాకే తెలియదు అంటుంది తులసి. సరే అమ్మా అంటుంది అనసూయ. ఎక్కడికి? ఆ పోలీస్ స్టేషన్‌కేనా అంటాడు నందు కోపంగా.. మీకు ముందే చెప్పాను నన్ను అడిగే హక్కులేదు అంటుంది.
దాంతో అంకిత తులసితో.. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం ఆంటీ.. ప్లీజ్ మీరు తొందరపడొద్దు అంటూ ఏడుస్తూ చెబుతుంది. నందు తండ్రి కూడా.. సరేరా నందు.. అభిని కాపాడే బాధ్యత నీది.. నీ ప్రయత్నం నువ్వు చెయ్యరా.. అంటూనే.. నందుకే సపోర్ట్ చేస్తాడు. ‘నిజంగానే నందు మీద మీ అందరికీ అంత నమ్మకం ఉందా? నాకు మాత్రం లేదు.. ఆయనకి మాట ఇవ్వడమే కానీ నిలబెట్టుకోవడం చేతకాదు.. అంటూ తులసి అంటుంది. ఇంక ఇంట్లో వాళ్లతో నా కొడుకుని బయటకు తీసుకురావడానికి నేను ఏం చేస్తానో చెప్పను చేసి చూపిస్తాను.. ఇది నా మొండితనం అనుకుంటారో.. బాధ్యత అనుకుంటారో మీరు నన్ను ఏం అనుకుంటారో మీ ఇష్టం.. అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. ఎస్‌ఐ వచ్చే టైమ్‌కి తులసి పోలిస్టేషన్ ఎదురుగా అభి ఫొటోస్ పెట్టి ధర్నాకు దిగుతుంది. నీకు ధైర్యం చాలా ఎక్కువ అనుకుంటా అంటాడు ఎస్‌ఐ. అలా ఇద్దరి మధ్య చాలా సేపు మాటలయుద్ధం నడుస్తుంది. దీనితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్‌లో ఎస్సై తులసి ధర్నాను ఎలా అడ్డుకుంటాడు. అభిని ఏం చేయనున్నాడో చూడాల్సిందే.
- Intinti Gruhalashmi july 1 Today Episode : లాస్య ప్లాన్‌ను పసిగట్టిన తులసి.. భాగ్య,లాస్యలకు దిమ్మ తిరిగే షాక్..?
- Intinti Gruhalakshmi MAY 24 Today Episode : అభి పై మండిపడిన అంకిత..ప్రేమ్ గురించి బాధ పడుతున్న తులసి..?
- Intinti Gruhalakshmi serial Oct 3 Today Episode : తులసి పై కోప్పడిన సామ్రాట్.. నిజం తెలుసుకునే పనిలో తులసి..?















