...

Intinti gruhalakshmi: ఎస్సై కోసం బార్‌కి వెళ్లిన తులసి… కొడుకుని రక్షించుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏం చేయనుంది

Intinti gruhalakshmi: మధ్యతరగతి ప్రేమానురాగాలు కష్టసుఖాలు అత్యద్భుతంగా చిత్రించిన డైలీ సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి. మరి ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. దాని హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

intinti gruhalakshmi latest episode

Advertisement

బారు షాపులో మందు తాగుతున్న ఎస్ఐ కోసం వెతుకుతూ ఉంటుంది తులసి. ఇంతలో అక్కడ మందు తాగేవాళ్లు చాలామంది తనపై అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి.. కొడుకు కనిపించడం లేదన్న బాధతోటి మందు కొడదామని వచ్చావా అని అడుగుతాడు. దీంతో లేదండి.. మీ కోసమే వచ్చాను అంటుంది తులసి. ఎస్ఐ గారు మా అబ్బాయి మీ షర్ట్ పట్టుకోవడం తప్పే అంటుంది తులసి. ఒక పని చేద్దాం. నువ్వు నా పక్కన కుర్చొని ఒక పెగ్ వేయ్. అప్పుడైనా గుర్తొస్తుందేమో అంటాడు.

Advertisement

ఈ బారుకు వచ్చే నేను సగం చచ్చిపోయాను. ఒక తల్లి మానసిక క్షోభతో ఆడుకొని తప్పు చేశారు. ఒక ఆడదాన్ని ఆత్మాభిమానాన్ని చంపి ఇంకా తప్పు చేశారు. నా కన్నీళ్లతో మీ మనసు కరుగుతుందేమోనని ఆశతో వచ్చాను. ఇదంతా నా కొడుకును రక్షించుకోవాలన్న తాపత్రయంతో. ఒక తల్లి ఉసురు పోసుకొని మీరు ప్రశాంతంగా బతకలేరు.. అంటుంది తులసి. దీంతో అవునా.. నేను చచ్చిపోతానా.. నాకు భయమేస్తుందిరా అని అంటాడు ఎస్ఐ. నా కొడుకుని నీ నుంచి ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు అంటుంది తులసి ఏంటి ఛాలెంజ్‌ చేస్తున్నావా అంటాడు సీఐ.

Advertisement

మరోవైపు తులసి ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు నందు. రోడ్ల మీద పడి వాడి కోసం తిరుగుతున్నావా అని అంటాడు. దీంతో ఎస్ఐ ఉన్న బార్‌కి వెళ్లి తనను బతిమాలాను అతను కరగలేదు అని చెప్తుంది. చేసింది పనికిమాలిన పని.. పైగా గొప్పలు చెప్పుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు నందు. లేకపోతే మీలా ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చోవాలా.. అంటూ ప్రశ్నిస్తుంది. కోపంతో నందుపై విరుచుకుపడుతుంది తులసి. నా ప్రాణాలు పణంగా పెట్టి నేను పిల్లలను కన్నాను కానీ.. మీరు చేసిందేంటి అని ప్రశ్నిస్తుంది. అందంతా చూసిన లాస్య నందుతో నేనే నీ ప్లేస్ లో ఉంటే ముందు తులసిని మెడపట్టి గెంటేసేదాన్ని అంటుంది.

Advertisement

మరోవైపు అభిని ఓ ప్లేస్‌లో కట్టేసి తన మనషులతో కొట్టిస్తాడు ఎస్ఐ. కానిస్టేబుల్స్ చెప్పినా కూడా వినడు. పాపం తగులుతుంది సార్ అంటారు. అయినా ఎస్ఐ వినడు.

Advertisement

కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ముందు టెంట్ వేసి అరెస్ట్ చేసిన తన కొడుకును చూపించండి.. అంటూ బోర్డు పట్టుకొని కూర్చుంటుంది తులసి. నువ్వు కూడా పోలీస్ స్టేషన్ ముందు ఇలా టెంట్ వేసుకొని కూర్చొని నా ఈగోను టచ్ చేస్తున్నావు అంటాడు పోలీస్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
Advertisement