Viral video: సాధు జంతువులను ఆడించే వాళ్లను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ పాములు, పులులు, సింహాలను ఆడించాలంటే చాలా ధైర్యం కావాలి. అంతేనా వారు ఏం చెప్పినా, చేసినా అవి వినేలా ఉండాలి. అప్పుడే వాళ్లు వాటితో ఆటలు ఆడొచ్చు. లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా వీరి ప్రాణాల మీదకే వస్తుంది. అయితే ప్రస్తుతం అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూస్తే భయపడాలో లేక నవ్వుకోవాలో కూడా అర్థం కాదు. అందుకు కారణం అందులో ఓ వ్యక్తి చేసిన అతే.
విషం లేని పాములను ఆడించడం, పట్టుకోవడం, సెల్ఫీలు, వీడియోలు తీస్కోవడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ విష పాములతో ఆడాలంటే మాత్రం సాహసమనే చెప్పాలి. అయితే ఈ వీడియోలో ఓ వ్యక్తి పామును ఆడిస్తూ కనిపించాడు. తరచుగా దాని తొక్కను పట్టుకుంటూ ఆడించాలని చూశాడు. కానీ అసలే అది నాగుపాము కావడం.. దానికి కోపం రావడంతో… ఆ పాము ఒక్కసారిగా అతడిని ప్రైవేట పార్ట్ ను కొరకేసింది. వెంటనే పామును పడేసి లబోదిబోమన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయింది. నాగు పాముతో ఆటలాడితే అలాగే ఉంటుందని కొందరు అనడం.. బాగయ్యిందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మీరూ ఓసారి ఈ వీడియో చూసేయండి.
View this post on Instagram
Advertisement