Viral video : పెళ్లి అంటే ఆ జోషే వేరు. ఆ సందడే వేరు. బంధుమిత్రులు ఫుల్ యాక్టివ్ గా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గు పడుతుంటే.. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో అవేవీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మిగతా వారి కంటే పెళ్లి కూతుళ్లే తెగ సందడి చేస్తున్నారు. వారి పెళ్లికి వారే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. పెళ్లి అనగానే పెళ్లి కూతురి చీర గురించి చాలా మంది ముచ్చట్లు పెడుతుంటారు. కానీ ఇప్పుడు ఆమె చేసే డ్యాన్స్ గురించి మాట్లాడుకోవడం కామన్ అయిపోయింది.

ఈ మధ్య కాలంలో పెళ్లి అనగానే పెళ్లి కూతురి డ్యాన్స్ ఉండటం చాలా వివాహ వేడుకల్లో చూస్తూనే ఉంటున్నాం. ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతోంది. మండపంలో పెళ్లి కొడుకు కూర్చుని ఉండగా పెళ్లి కూతురు మండపానికి వస్తూ డ్యాన్స్ చేస్తోంది. బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు అని.. అనే సాంగ్ కు స్టెప్పులేస్తూ ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి కూతురి ఎంట్రీ సూపర్ అంటున్నారు. ఈ వీడియోను రెండు లక్షలకు పైగా లైక్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
A post shared by Glad Clicks Photography (@glad_clicks)
Advertisement
Read Also : Viral Video : చీరకట్టులో నడుము అందాలను చూపెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి.. వీడియో వైరల్