Samantha Majili : సమంత.. నాగచైతన్య.. ముచ్చటైన జంట.. వీరిద్దరూ చిలుకా గోరింకల్లా చిరకాలం కలిసి ఉండాలని అభిమానులు సహా వారిద్దరిని అభిమానించే ప్రతిఒక్కరూ కోరుకున్నారు.. కానీ, సామ్, చైతూలు ఊహించని విధంగా విడాకులతో తమ మూడు ముళ్ల బంధాన్ని ముగించారు.
ఇప్పటికీ సామ్, చైతూలు విడిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేని వారు ఎందరో ఉన్నారు.. దేవుడి దయ వల్ల మళ్లీ ఈ జంట ఒక్కటైతే బాగుండూ అని కోరుకునేవారు లేకపోలేదు. ఇద్దరూ విడిపోయాక ఎవరికి వారు తమ పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. చేతినిండా సినిమాలతో జీవితాన్ని ఆశ్వాదిస్తున్నారు. సామ్ చైతూతో ఉన్న ఫొటోలను ఒక్కొక్కటిగా డిలీట్ చేస్తోంది. కానీ, ఈసారి చైతూ ఫొటోను సామ్ తన ఇన్ స్టాలో పోస్టు చేయడం అభిమానులతో సహా చాలామంది నెటిజన్లు షాక్ అయ్యారు. చైతూ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

ఇంతకీ సమంత పోస్టు చేసిన ఆ ఫోటో ఏంటంటే.. ఇద్దరూ కలిసి నటించిన మజిలి మూవీలోని ఓ ఫొటో. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 3 ఏళ్లు పూర్తి అయింది. సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఆ మజిలీ పోస్టర్‌ని పోస్టు చేసింది. నాగచైతన్య సింగిల్ పిక్ తో పాటు అదే పోస్టర్‌లో సమంతతో పాటు మరో హీరోయిన్ తో చైతూ ఫొటోను షేర్ చేసింది.
సమంత పోస్టు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. చై, సామ్ కలిసి సినిమా చేయాలని అభిమానులు కోరుతున్నారు. మరికొందరు మూవీలో మాదిరిగా చైతూ, సామ్ మళ్లీ ఇద్దరూ కలిసిపోతే బాగుండూ అని కామెంట్లు పెడుతున్నారు. చైతూ, సామ్ మజిలి పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు సరదాగా సమంత పోస్టుకు కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Samantha : పాన్ ఇండియానా బొక్కనా.. నెటిజన్ ట్వీట్‌కు సమంత రెస్పాన్స్.. వీడియో..!