Ennenno Janmala Bandham Serial Today 29 July Episode : తెలుగు బుల్లితెరలో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి గత ఎపిసోడ్‌లో భాగంగా వేద ఇంకా మాళవిక బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు.. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం యశోదర్ వేద దగ్గరకొచ్చి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ మాటలు కాదు వేద మంత్రాలు.. నీతులు కాదు వేద నిజాలు.. కానీ వీటి నుంచి మాళవిక నేర్చుకుంటుంది అని నమ్మకం లేదు వేద ఎందుకంటే మాళవిక చెప్పినా వినదు.. అసలు మాలవిక నా దృష్టిలో మనిషి కాదు.. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ మాళవికకు వేటికి అర్హత లేదు. ఎందుకంటే ఖుషిని వదిలిపెట్టి.. సుఖం కోసం వెళ్ళినప్పుడే మాళవిక నా దృష్టిలో నుంచి వెళ్ళిపోయింది.. వేద పదా వెళ్దాం అంటూ వెళ్లిపోతారు.
వేద మాళవిక అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి యశోదర్ వచ్చి కాలు ఇటు ఇవ్వు నేను ఫస్ట్ ఏయిడ్ చేస్తాను అంటాడు. వేద థాంక్యూ అని అంటుంది. అప్పుడు యశోదర్ నువ్వు చూడడానికి చాలా మెత్త దానిలా కనిపిస్తావు.. కానీ నువ్వు చాలా గట్టి దానివి. ఇంత గాయమైతే తలపై బోనం పెట్టుకొని ఎలా వెళ్లగలిగావు నేనైతే అసలే వెళ్ళలేను అంటాడు. అప్పుడు వేద ఇంటి కోసం అండి అంటుంది. ఇకపోతే చిత్ర అమ్మ వారి దగ్గరకు వచ్చి అమ్మ వసంత్ ని నాకు ఇవ్వు వసంత్ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఇద్దరి మధ్యలోకి ఆ నిధి వచ్చింది. నా వసంత్ ని నాకు ఇవ్వమ్మా వసంత్ కోసమే ఈరోజు నీకు బోనం ఎత్తాను అంటుంది. ఇక వేద నా కడుపులో మోసే నొప్పి నాకు ఎలాగూ లేదు. ఎక్కడికి పోయినా చాలామంది మీకు పిల్లలు పుట్టే భాగ్యం లేదు అని నన్ను అవమానించారు. అవన్నీ తట్టుకున్నాను కానీ మాళవిక కూడా అనుమానించింది నేను తట్టుకోలేకపోయాను అండి ఖుషి కి అమ్మ అయ్యే భాగ్యం లేదా ఆ మాలవిక వదిలేసి పోయింది. కానీ ఖుషి నన్ను అమ్మ అని పిలిచింది. అందుకే ఖుషి కోసం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను.
కాలికి గాయమైంది అయితే ఏంటి గుండెకి ఏందో గుండెకి గుండెకి తగిన గాయం కంటే ఎక్కువేమీ కాదు అమ్మవారి మీద భక్తి ,శ్రద్ధ, ప్రార్ధన ఈ మూడే అమ్మవారి దగ్గరికి నన్ను చేర్చాయి ఈ నొప్పి కాలు పైన నొప్పి నాకేం గుర్తుకు రాలే ఇంకా నేనే ఎత్తిన బొనమే అమ్మవారి దగ్గరికి ముందు సమర్పించాను. నా కాలికి గాయం అయితే మీకు బాధ అనిపించొచ్చు ఎందుకంటే మీరు నా భర్త నా గురించి ఆలోచిస్తున్నారు ఇది చాలని నాకు అంటుంది. అప్పుడు యశోదర్ నీలో నేను అమ్మని చూశాను వేద.. యు ఆర్ ది బెస్ట్ మదర్.. బిడ్డని కనలేని లేని వాళ్ళు కాదు.. బిడ్డని పెంచలేని వాళ్ళు గొడ్రాలు ఆ బోనాల తల్లి సాక్షిగా ఖుషి నీ బిడ్డ అమ్మ స్థానానికి వేరే అర్హత, హక్కు ఎవరికీ ఉండదు అని అంటాడు. వసంత్ , చిత్రని అమ్మవారికి ఏమి కోరుకున్న చిత్ర అంటాడు. నా గురించి ఏమైనా కోరుకుంటావా అని అడుగుతాడు.
అప్పుడు చిత్ర నీ గురించి నేను ఎందుకు కోరుకుంటాను.. నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తను ఏమైనా కోరుకుంది ఏమో అడుగు.. నువ్వు ఇంతకీ నువ్వేం కోరుకున్నవ్ అంటుంది. అప్పుడు వసంత్ నేనేమి కోరుకోలేదు మూడే కోరుకున్నాను.. అవేంటంటే ఒకటి చిత్ర రెండవది చిత్ర ,మూడవది చిత్ర అంటాడు కొంచెం నవ్వవా ప్లీజ్ అంటాడు. సులోచన ఇంకా మలబార్ మాలిని ఖుషి దగ్గరికి వచ్చి మీకు ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అంటూ గొడవ పడతారు. అప్పుడు ఖుషి నాకు నానమ్మ అంటే ఇస్తామని చెబుతోంది.. ఇంకా అమ్మ అంటే బోలెడంత ఇష్టం అంటుంది, కానీ నాకు ఎక్కువగా ఇష్టం వేద అమ్మ అంటుంది.
Ennenno Janmala Bandham Serial : యశోదర్ నీ సంగతి చూస్తానన్న కైలాష్.. నా ఆయుధం నీ ఇంట్లోనే ఉందటూ ఫైర్..
ఇకపోతే కాంచన కైలాష్ దగ్గరికి వస్తుంది. అప్పుడు కైలాష్ ఎందుకు వచ్చావు కాంచన నామీద నీకు కోపం రాలేదా.. అసహ్యంగా లేదా అంటాడు. అప్పుడు కాంచన ఉండండి నా మీద నాకే కోపంగా, అసహ్యంగా ఉందండి.. నా లాంటి దాని చేసుకోబట్టే మీకు ఇలాంటి కర్మ పట్టింది నన్ను క్షమించండి అంటుంది. అప్పుడు కైలాష్ లే కంచు ఇంట్లో నువ్వు నన్ను విడిపించమని గొడవ చేయకు నేను ఒక అయిదారేళ్ల ఇలానే జైల్లో మగ్గుతాను. మీ తమ్ముడు తలుచుకుంటే నేను క్షణంలో బయటికి రావచ్చు.. క్షణంలో మనిద్దరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. కానీ నువ్వు ఇంటికి వెళ్లి మీ అమ్మతో అందరూ మంచిగానే ఉన్నారు. నేను ఎందుకు ఇలా ఉండాలి. మా ఆయన కింద పడుకుంటున్నారు నేను ఎందుకు మంచం మీద పడుకోవాలి అంటాడు. అప్పుడు కాంచన సరే అని అంటుంది. అరే కైలాష్ నువ్వు సూపర్‌రా.. వద్దు అనుకున్న వచ్చింది విడిపించుట అన్నం వినిపిస్తుంది అదే పెళ్ళాం రా అనుకుంటాడు. ఇక సులోచన, మాలిని మళ్లీ గొడవ పడతారు. ఇక యశ్, వేదాలు అన్నం తినమంటు ఖుషినీ ఆటపట్టిస్తారు. రత్నం వచ్చి కంచు ఏంది మాలిని అంటాడు.
అప్పుడు మాలిని, కాంచన అన్నం తిన్నారా అండి అంటుంది వెంటనే వేద వదిన నేను తీసుకొస్తాను అంటూ వెళ్తుంది. వదిన నన్ను క్షమించండి ఇక్కడ అందరి కంటే నీకే ఎక్కువ నష్టం జరిగింది. కైలాష్ అన్నయ్యగారు మంచిగా మారితే మీరు ఎప్పటి లాగా సంతోషంగా ఉండొచ్చు అంటుంది. నేను నొప్పులు చేతులు పెట్టినందుకు కాదు నిప్పులే వచ్చి నా చేతిలో పడ్డాయి అంటుంది కాంచన. అప్పుడు వేద ఏం కాదు వదిన అన్ని సర్దుకుంటాయి.. నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు రండి వదిన అంటుంది. ఇక కైలాష్ యశోదర్ నీ సంగతి చూస్తాను. ఇక మనిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది.. కానీ నా ఆయుధం నా దగ్గర లేదు నీ ఇంట్లోనే ఉంది.. అది నీ అక్క అదో పిచ్చి మాలోకం అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.
Read Also : Ennenno Janmala Bandham : అహానికి పోయి విరహం అనుభవిస్తూ, విషాదగీతం పాడుకున్న యష్, వేదలు.