Karthika Deepam Feb 8 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక మోనిత, కార్తిక్ ఆపరేషన్ చేసిన ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో కాస్త చెబుతారా అని అంజలి ని అడుగుతుంది.

దానికి అంజలి ఇందాక కేక్ పంచినా ఆయనే ఆ అమ్మాయి ఫాదర్ అని చెబుతుంది. దాంతో మోనిత షాక్ అయ్యి వాళ్ల కోసం అక్కడ వెతుకుతుంది కానీ కార్తీక్ వాళ్ళు అక్కడినుంచి కనబడకుండా వెళ్లి ఆటోలో అప్పారావు ఇంటికి వెళతారు. ఇక మోనిత వంటల దగ్గరికి వెళ్లి చూసినప్పటికీ అక్కడ వీరు కనిపించరు. కార్తీక్, దీపలు ఈలోపు అప్పారావు ఇంటికి వెళ్తారు.
కానీ అక్కడ అప్పారావ్ ఇల్లు గడియ వేసి ఉంటుంది. దాంతో కంగారు పడుకుంటూ కార్తీక్, దీప లు తమ ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంటి పక్క ఆవిడ హిమ ను రుద్రాణి తీసుకు వెళ్లిందని సౌర్య ను నేనే కాపాడాను అని చెబుతోంది. దాంతో కంగారుగా కార్తీక్ వాళ్ళు రుద్రాణి ఇంటికి వెళ్తారు.
ఇక రుద్రాణి, హిమను ఎక్కడో కనపడకుండా దాచి అప్పు కట్టి తీసుకెళ్లండి అని చెబుతుంది. దాంతో దీప, రుద్రాణి కి చేతులెత్తి దండం పెట్టి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడడానికి కూడా సిద్ధమవుతుంది. ఈలోపు అక్కడికి సౌందర్య వచ్చి రుద్రానికి ఒక రేంజ్ లో వార్నింగ్ ఇస్తుంది. దీప తన కోడలు అని తెలిసిన రుద్రాణి ఆశ్చర్యపోతుంది.
ఒకవైపు కార్తీక్, సౌందర్య ను మమ్మీ అని పిలుస్తాడు. దాంతో రుద్రాణి మరింత శాఖ అవుతుంది. సౌందర్య కార్తీక్ స్థాయి గురించి రుద్రానికి చెబుతుంటే రుద్రా నికి చెవులు ఏమాత్రం పనిచేయవు. ఈ క్రమంలోనే సౌందర్య కార్తీక్ గొప్పతనాన్ని గురించి చెబుతూ
తన అపాయింట్మెంట్ కోసం ఎవరైనా రోజుల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు అని గొప్పగా చెబుతుంది. అది విన్న రుద్రాణి ఎంతో ఆశ్చర్యపోతుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగంలో సౌందర్య, రుద్రాణి అప్పు కట్టి హిమ ను విడిపిస్తుందో లేదో రేపటి భాగంగా చూడాలి.
Read Also : Guppedantha Manasu : రిషి, దేవయాని లు మాట్లాడుకున్న మాటలు విని మహేంద్ర ఏం చేశాడంటే!
- Karthika Deepam serial Oct 18 Today Episode : కార్తీక్ మాటలకు షాక్ అయిన మోనిత..వారణాసి పరిస్థితి చూసి బాధపడుతున్న శౌర్య..?
- Karthika Deepam Serial : మోనిత కన్నీటికి కరిగిపోయిన డాక్టర్ బాబు.. ట్విస్ట్ ఏంటంటే?
- Karthika Deepam Oct 25 Today Episode : వాణిని గుడ్డిగా నమ్మిన దీప, దుర్గ.. మోనితను అనుమానిస్తున్న కార్తీక్.?















