Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆదిత్యకు దేవిని ఇస్తాను అన్న మాట ఇచ్చిన రాద దేవీ నీ బిడ్డ అని ప్రపంచానికి చెప్పను అంటేనే అని కండిషన్ ని పెడుతుంది. అందుకు సారీ అని చెప్పి ఆదిత్య రాధకు మాట ఇస్తాడు. ఇంటికి వెళ్ళిన ఆదిత్య త్వరలోనే వారసురాలు రాబోతోంది అని చెప్పడంతో దేవుడమ్మ కుటుంబ సభ్యులు అందరూ ఆనందపడతారు.
ఇంతలో సత్య, దేవుడమ్మ ఇద్దరూ కలసి పందెం వేసుకుంటారు. అప్పుడు ఇద్దరూ చెస్ ఆడుతూ ఉంటారు. సత్య బాబు కావాలని, దేవుడమ్మ పాప కావాలని పందెం పెడతారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆదిత్య సత్య ను పక్కకు తప్పించి సత్య బదులు ఆడుతాడు. ఇక ఆట రసవత్తరంగా సాగుతుండడంతో ఇంట్లో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే చెస్ ఆట లో దేవుడమ్మ గెలుస్తుంది. ఓడిపోయినందుకు సత్య నువ్వే నన్ను ఓడించావు అని సత్య తో సరదాగా గొడవకు దిగుతుంది. లేదు అంటూ ఆదిత్య బెడ్రూమ్ లోకి పరుగులు తీయగా, సత్య కూడా ఆదిత్య వెనకాలే పరిగెత్తుతూ వెళుతుంది. అప్పుడు సత్య నాకు బాబు కావాలి అని అనగా, ఆదిత్య మాత్రం నాకు పాప కావాలి అమ్మకు కూడా పాప కావాలి అంటూ ఇతని ఆటపట్టిస్తూ రూంలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు.
ఇక వెంటనే సత్య వెళ్ళి తన బిగి కౌగిలిలో బంధిస్తూ బాబే కావాలి, బాబే పుడతాడు అని చెప్పే వరకు నేను వదిలిపెట్టను అని సత్య అనగా.. అబ్బాయి ఇలాగే బాగుంది ఎంత సేపు అయినా ఇలాగే పట్టుకో సత్య అంటూ మళ్ళీ ఏడిపిస్తారు ఆదిత్య. అలా కొద్దిసేపు వారిద్దరు రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు రాధ దేవి ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.
దేవిని ఆదిత్యకు ఇచ్చేసిన తర్వాత చిన్మయి ని చూసుకుంటూ బతకాలి అని నిర్ణయించుకుంటుంది. గతంలో రాద నువ్వు ఏ విషయం అయినా చెప్పవచ్చు అని ధైర్యం చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో అతనితో మాట్లాడడానికి వెళుతుంది రాద. అక్కడికి వెళ్లి మౌనంగా ఉండడం తో చెప్పు రాద అని అంటాడు మాధవ.
అప్పుడు రాధా దేవి కి నాయన ఎవరు అంటే ఏమి చెప్పాలి అని అనగా.. అప్పుడు మాధవ బాధ గా పైకి లేచి ఏం మాట్లాడుతున్నావ్ రాధ.. దేవి నా కూతురు అని అంటాడు. నీ మనసులో ఆలోచనలకు దేవికి నాన్న గా నన్ను దూరం చేయకు, నాకు ఇద్దరు పిల్లలు. దేవీ నా బిడ్డ కాదు అని తెలిసి రోజంటూ వస్తే ఆ రోజు నేను ఉండకూడదు అని మాధవ ఆవేశంగా వెళ్ళిపోతాడు. సత్య అప్పుడు ఏం చేయాలి అని ఏడుస్తూ తల పట్టుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.