Devatha: మా టీవీలో ప్రసారమవుతున్న దేవత సీరియల్ మంచి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సీరియల్ లో సుహాసిని, అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే దేవత సీరియల్ లో ఈరోజు జరగబోయే సన్నివేశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు అనగా మార్చి 22వ తేదీ దేవత సీరియల్ ఎపిసోడ్ లో రామ్మూర్తి, జానకి ల షష్టిపూర్తి గురించి పిలవటానికి మాధవ్ దేవుడమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మాధవ్ కి వెళ్ళటం ఇష్టం లేక పోయినా వాళ్ళ నాన్న చెప్పటంతో దేవుడమ్మని, ఆదిత్య ని షష్టి పూర్తికి ఆహ్వానించడానికి రాధా, మాధవ్ ఇద్దరూ కలిసి దేవుడమ్మ ఇంటికి వెళ్తారు.
అక్కడికి చేరుకోగానే రాదా కారులో నుండి దేవుడమ్మను చూస్తుంది.ఇంట్లో కి వెళ్ళటానికి భయపడిన రాధా ఇప్పుడు ఇంట్లో కి వెళ్ళకుండా ఏం చేయాలి అని భయపడుతూ గేటు దాటి లోపలికి వెళుతున్న సమయంలో రాధా వీళ్ళని పిలవడానికి నేను రావటమే ఎక్కువ నువ్వు వెళ్లి కార్లో కూర్చో అంటూ మాధవ్ రాధ ని పంపిస్తాడు. హమ్మయ్య మంచిమాట చెప్పిండ్రు సారు అంటూ మనసులోనే అనుకొని వెళ్లి కార్ లో కూర్చుంటుంది.
మాధవ్ ఇంటి లోపలికి వెళ్లగానే దేవుడమ్మ మాధవ్ ని చూస్తూ ఆదిత్య వచ్చి కూర్చో.. సత్యాన్ని వెళ్లి కాఫీ తీసుకురా అమ్మ అంటూ సత్యకు చెబుతుంది. ఆపండి మీ మర్యాదల కోసం నేను ఇక్కడికి రాలేదు అని మాధవ్ అంటాడు. ఇంటికి వచ్చిన వాళ్లని మర్యాదించడం మా సాంప్రదాయం అని దేవుడమ్మ అంటుంది.
నాన్నగారు తన షష్టిపూర్తికి మిమ్మల్ని పిలవమని నన్ను పంపించాడు. నాకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు వస్తే ఆయన సంతోషిస్తాడు. రావడం రాకపోవడం మీ ఇష్టం అంటూ మాధవ్ బయటికి వెళ్ళిపోతాడు.
మాధవ్ వెళ్ళిన తర్వాత దేవుడమ్మ ఆదిత్య తో ఇలా అంటుంది.. అసలు ఏంట్రా వీడు వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే కి మనల్ని ఇలా పిలుస్తున్నాడు అని కోపడుతుంది.
అసలు రామ్ మూర్తి గారికి వీడికి ఏమైనా పోలిక ఉందా అంటూ సీరియస్ అవుతుంది. ఆదిత్య మాట్లాడుతూ.. మనం వెళ్ళని దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవటం అంటాడు. రామ్మూర్తి గారు మనల్ని అంతగా పిలిస్తే వెళ్లకపోతే ఏం బాగుంటుంది అని సత్య అంటుంది.
రాధా మాధవ్ కార్లో వెళ్తూ వాళ్ళు ఏమన్నారు వస్తాను అన్నారా? వచ్చేలాగా ఉన్నారా? అని అడుగుతుంది. ఏమో రాధా నేనైతే పిలిచాను వస్తారో లేదో వాళ్ళ ఇష్టమే . దేవి ఆదిత్య కి ఫోన్ చేసి ఆఫీసర్ సారు తాత అవ్వ షష్టిపూర్తికి మిమ్మల్ని పిలవడానికి అమ్మ నాయన వచ్చిండ్రు. మా తాత షష్టిపూర్తికి మీరు కచ్చితంగా రావాలి అని ఆదిత్య నీ బలవంతపెడుతుంది.
మొదట ఆదిత్య పని ఉంది రాలేను అని చెప్తాడు. కానీ సత్య వచ్చి ఆదిత్యని ఒప్పిస్తుంది. రామ్మూర్తి వాళ్ళ ఇంట్లో షష్టిపూర్తికి అన్ని పనులు పూర్తయ్యాయి. ఆఫీసర్ వాళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని రామ్మూర్తి అడుగుతాడు. ఆఫీసర్ వస్తాం అని నాకు మాట ఇచ్చిండు అని అప్పుడు దేవి అనటంతో రాధా షాక్ అవుతుంది.