Intinti Gruhalakshmi Sept 17 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు ముందు సామ్రాట్ తులసి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్, నందు తో నువ్వే తులసి మాజీ భర్త అని చెప్పకపోవడం మంచిది అయింది లేకపోతే నేను తులసిని అందరిలాంటి అమ్మాయిని అనుకునేవాడిని అని అంటాడు సామ్రాట్. తులసి మాజీ భర్త తులసి జీవితం నాశనం చేశాడు అనుకున్నాను కానీ ఇప్పుడే తెలుస్తుంది మీరే మీ జీవితం నాశనం చేసుకున్నారని అని అంటాడు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అని అడగగా ఏమీ లేదు ఉత్తినే అని అంటాడు సామ్రాట్. ఇంతలోనే అక్కడికి తులసి లాస్ట్ ఇయర్ వాళ్ళు వస్తారు. అప్పుడు సామ్రాట్, తులసితో రేపు మనకు ఒక ప్రాజెక్టు మీటింగ్ ఉంది. అక్కడికి బయలుదేరాలి అనడంతో నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
అప్పుడు సామ్రాట్ వెళ్తూ నందు పనిమీద శ్రద్ధ పెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వారిద్దరిని చూసి లాస్య నందు ఇద్దరూ కుళ్ళుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నందు జరిగిన విషయాన్ని తలచుకొని తాగి రోడ్డుమీద అరుస్తూ నానా రచ్చ చేస్తూ ఉంటాడు. ఇంతలో కారు ఆగిపోవడంతో మెకానిక్ వస్తాడు.
Intinti Gruhalakshmi Sept 17 Today Episode : తాగి రోడ్డుమీద రచ్చ చేసిన నందు..
అప్పుడు రిపేర్ చేసి ఆ మెకానిక్ అక్కడ నుంచి వెళ్తుండగా నీకు ఒక పని చెప్తాను చేస్తే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అనగా చెప్పండి సార్ అనడంతో ఒక కారుకి బ్రేకులు ఫెయిల్ చేయాలి అని చెబుతాడు నందు. ఆ తర్వాత నందుని అక్కడికి వెళ్లి సామ్రాట్ కార్ బ్రేకులు ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. మరుసటి రోజు ఉదయం తులసి, సామ్రాట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది.
అప్పుడు ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకుని అక్కడ నుంచి బయలుదేరుతారు. కొద్ది దూరం కి వెళ్లిన తర్వాత కారు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అక్కడే ఒక ఫోల్ కి వెళ్లి కార్ యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఇదంతా జరిగినట్టు నందు ఊహించుకుని గట్టిగా తులసి అని అరుస్తాడు.
ఇంతలోనే లాస్య అక్కడికి వచ్చి ఎందుకు నువ్వు తులసి అని ఆ గట్టిగా అరిచావు అని అంటుంది. లేదు నేను లాస్య అని పిలిచాను నీకు తులసి అని వినిపించింది దానికి నేనేం చేయను అని అంటాడు నందు. ఇక రేపటి ఎపిసోడ్ లో నందు , హనీ ఇద్దరు కలిసి కార్లో బయటకు వెళ్తూ ఉండగా అప్పుడు కారు బ్రేకులు పనిచేయకపోవడంతో ఆ కారు వెళ్లి చెట్టుకి గుద్దుకొని యాక్సిడెంట్ అవుతుంది. దీంతో హనీ, సామ్రాట్ ఇద్దరు గాయపడతారు. ఇంతలోనే తులసికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో తులసి షాక్ అవుతుంది.
- Intinti Gruhalakshmi April 23Today Episode: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అభి, అంకిత.. ఎమోషనల్ అవుతున్న తులసి..?
- Intinti gruhalakshmi : ఎస్సైపై యుద్ధం ప్రకటించిన తులసి… ఎస్సై ఏం చేయనున్నాడు..?
- Intinti Gruhalakshmi serial Sep 15 Today Episode : నందు ముందు తులసి గురించి గొప్పగా పొగిడిన సామ్రాట్.. ఆనందంలో తులసి..?













