Telugu NewsLatestDevatha: రాధ మాటలకు సంతోషంతో థాంక్స్ చెప్పిన మాధవ.. మండిపడ్డ రాధ..?

Devatha: రాధ మాటలకు సంతోషంతో థాంక్స్ చెప్పిన మాధవ.. మండిపడ్డ రాధ..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రామ్మూర్తి దంపతులు రాధ దగ్గరకు వచ్చి నీ అంతట నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్తాను అంటే మేము అడ్డుపడడం అంటూ ధైర్యం చెబుతూ మాట్లాడుతారు.

Advertisement

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో రాధ ఒకటే కూర్చొని ఉండగా ఇంతలో అక్కడికి వెళ్ళిన రామ్మూర్తి,జానకి లు దేవి దత్తత విషయం గురించి ఆదిత్య ఇంకా ఏమైనా ఇబ్బందులు పెడుతున్నాడా? దేవిని ఇవ్వమని బలవంతం పెడుతున్నారా?అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో.. వారి మాటలు ఒకచోటినుంచి వింటున్న మాధవ రాధా ఎక్కడ నిజం చెబుతుందొ అన్న భయంతో అక్కడికి వచ్చి మనల్ని కాదని తీసుకెళ్లే ధైర్యం ఎవరికీ లేదు అనే విధంగా మాట్లాడతాడు.

Advertisement

Advertisement

ఆదిత్య కు సహాయం చేయడం కోసమే ఇలా చేసింది అనే రామ్మూర్తి దంపతులకు సర్ది చెబుతాడు మాధవ. ఆ తరువాత మాధవ రామ్మూర్తి వాళ్ళ ముందు నుంచి తనను కాపాడినందుకు థాంక్స్ చెబుతుంది రాధ. ఆ తర్వాత మాధవ భర్త బిడ్డకు మధ్య ఉన్న ప్రేమ గురించి అడగడంతో ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి వివరిస్తుంది రాద.

Advertisement

దానితో మాధవ ఆదిత్య మీద ఉన్న ప్రేమతో బిడ్డను ఇవ్వాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు.. అప్పుడు రాధ వెంటనే గతంలో ఒక చిన్న పొరపాటు చేశాను అది సరిదిద్దుకోవడానికి బిడ్డను ఆ ఇంటికి పంపాలి అని అంటుంది. ఆ తర్వాత మాధవ నువ్వు కూడా ఆదిత్య పిలిస్తే వెళ్ళిపోతావా అని అనడంతో ఆ ఇంటికి అసలు వెళ్ళను అని తన మనసులో ఉన్న నిజం చెప్పేసింది రాధ.

Advertisement

అప్పుడు మాధవ ఆనందంగా ఫీల్ అవుతు థాంక్స్ అని చెప్తాడు. ఆ తర్వాత పిల్లలు అడగడంతో రాదకి పువ్వులు పెట్టడానికి సిద్ధపడతారు మాధవ. దాంతో కోపంతో రాధా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తరువాత ఆ చిన్మయి దేవి కి ప్రేమతో అన్నం తినిపిస్తు ఉండడంతో అది చూసి ఇంట్లో వారందరూ సంతోషంగా ఫీల్ అవుతారు.

Advertisement

అప్పుడు అందరూ సంతోషంగా ఉండగా మాధవ మనసంతా సంతోషంగా ఉన్నా కూడా రాధ మాత్రం దేవిని ఆదిత్యకు ఇవ్వనందుకు బాధ పడుతుంది అని అనడంతో రాధ కోప్పడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు