Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామ్మూర్తి దంపతులు రాధ గతాన్ని కదిలించే ప్రయత్నం చేస్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి, రామ్మూర్తి లో రాధ తో మాట్లాడుతూ నువ్వు ఒకప్పటిలా ఉండటం లేదు అని అనడంతో అలా ఏమీ లేదు అని అంటుంది రాద. రామ్మూర్తి దంపతులు రాధ కు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో రాధ ఏమీ చెప్పలేక పోతుంది. ఇంతలో పిల్లలు అక్కడికి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు.
ఇంతలో అక్కడికి వచ్చిన మాధవ వారిని ఫోటో తీయాలి అనుకొని సెల్ఫీ తీస్తుండగా రాధ కోపంతో చూస్తూ ఉంటుంది. ఒకవైపు సత్య ఒంటరిగా ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన దేవుడమ్మ ఏం జరిగింది అని అడగగా అప్పుడు సత్య ఆదిత్య దేని గురించి ఆలోచిస్తున్నాడు మౌనంగా ఉంటున్నాడు అని అనడంతో దేవుడమ్మ కూడా ఆలోచనలో పడుతుంది.
ఆ తర్వాత ఈ విషయం గురించి నువ్వే అడుగు అని సత్య కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుడమ్మ. ఇంతలో అక్కడికి ఆదిత్య రావడంతో సత్య బ్రతిమాలి మరి టిఫిన్ చేయిస్తుంది. ఆ తరువాత ఆదిత్య మౌనానికి ఆలోచనలకు ఏం జరిగిందో చెప్పమంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
అప్పుడు ఆదిత్య మాధవ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని తినకుండా వెళ్ళిపోతూ సత్యకు సారీ చెప్పి మీరు భయపడాల్సిన పనిలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సత్య రాధ దగ్గరికి వెళ్లి తన బాధ గురించి అంతా వివరిస్తూ ఉండగా మాధవ చాటు నుంచి వారి మాటలు వింటూ ఉంటాడు.
సత్య మాటలు విన్న రాధ షాక్ అవుతుంది. ఇక అక్కడే వారి మాటలు వింటూ ఉన్న మాధవని చూసి షాక్ అయ్యి వారి మాటలు వినిపించకుండా ఉండటం కోసం మిక్సి ని ఆన్ చేస్తుంది. ఆ తరువాత వారిద్దరూ బయటికి బయలుదేరుతుండగా మాధవ ఎదురు పడతాడు. ఆ తర్వాత సత్య అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడు మాధవ నీ గతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడికి రావద్దు అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World