Intinti Gruhalakshmi Aug 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్‌లో నందుకి సామ్రాట్ ఫోన్ చేసి ఒక ఫైల్ మర్చిపోయాను తీసుకొని రమ్మని చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్‌లో సామ్రాట్ నందుకి ఫోన్ చేసి వైజాగ్‌కి రమ్మని చెప్పడంతో లాస్య నేను కూడా వస్తానందు అని ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఎయిర్ పోర్టులో తులసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగా ఆ ఫ్లైట్ రెండు గంటలు లేటు అని తెలియడంతో వెంటనే తులసి వారిని వెనక పంపించండి అని సామ్రాట్ అవుతుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అంటాడు.

ntinti Gruhalakshmi Aug 12 Today Episode : సంతోషంలో తులసి,సామ్రాట్..?

మరొకవైపు అభి హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా ఇంతలో అంకిత వచ్చి అబీపై కోప్పడుతుంది. తులసీని అభి ననా మాటలు అన్నందుకు కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు అంకిత నువ్వు ఇక్కడి నుంచి మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని అనగా అవి లోపల ఒకటి పెట్టుకుని బయటకు మాత్రం అంకితను కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. మరొకవైపు సామ్రాట్ ఆకలిగా ఉంది అనడంతో ఇంతలో తులసి తెచ్చిన పులిహోరను మొత్తం తినేస్తాడు. ఇంతలోనే అక్కడికి నందు వాళ్లు వస్తారు. అప్పుడు లాస్య రావడంతోనే సామ్రాట్,తులసి ఫై కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఇక నందు మాత్రం లాస్య మాటలకు చిరాకు పడుతూ ఉంటాడు. అప్పుడు నందుని సామ్రాట్ పొగుడుతూ ఉంటాడు. మామూలుగా ఎవరైనా భర్తలు తమ భార్యలను వెంట తీసుకెళ్లడానికి ఇష్టపడరు కానీ మీరు మాత్రం మీ భార్యని తీసుకొని వస్తున్నారు అంటూ నందుని పొగడగా అప్పుడు నందు తులసి వైపు చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలోనే ఫ్లైట్ రావడంతో అందరూ వెళ్లి కూర్చుంటారు.
ఆ తర్వాత ఫ్లైట్లో తులసి చేసే పనికి లాస్య నందుని మరింత రెచ్చగొడుతూ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అందుకోసంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఫ్లైట్లో ఒక వ్యక్తి లాస్యను చూసి ఫిదా అవుతాడు. మరోవైపు అంకిత వంట చేస్తూ అందులో ఉప్పు ఎక్కువ వేయడంతో అందరూ పర్లేదు అని సర్దుకుంటారు. అప్పుడు అభి మళ్ళీ తులసిని లాగే ప్రయత్నం చేస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్యను చూసి ఫిదా అయిన వ్యక్తి సామ్రాట్, తులసి ని మీరిద్దరూ భార్యాభర్తలు కదా అని అంటాడు. మాటలు విని నందు షాక్ అవుతాడు. అప్పుడు సామ్రాట్ అది కాదు అంటూ ఆ వ్యక్తికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు.
Read Also : Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ లతో కలిసి వైజాగ్ వెళుతున్న నందు,లాస్య.. టెన్షన్ పడుతున్న తులసి..?