Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసికి ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి వైజాగ్ కి వెళ్తూ ఉండగా ఇంట్లో అందరూ జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ కూడా జాగ్రత్తలు చెప్పడంతో నేను మీ అమ్మని నాకు జాగ్రత్తలు చెబుతావా అని అనగా నీవు లేకుంటే ఉండలేము అనడంతో తులసి ఆ మాటకు ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత తులసి బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సామ్రాట్ తన బాబాయ్ తో కలిసి కారులో ఏర్పాటుకు బయలుదేరుతాడు.
సామ్రాట్ సంతోషంగా ఉండటం చూసి వాళ్ళ బాబాయ్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఏంటి సామ్రాట్ ఎప్పుడు లేనిది ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అంటూ కొన్ని డైలాగులు కొడతాడు. మరొకవైపు తులసి ఏర్పాటు దగ్గరికి ఆటోలో వెళుతూ ఉంటుంది. మరొకవైపు సామ్రాట్ కారు ఆగిపోవడంతో లిఫ్ట్ కోసం రోడ్డుపై వచ్చే వెహికల్స్ ని అడుగుతూ ఉంటాడు.
తులసి గారు అక్కడికి చేరుకుంటారు ఆమెకు ఏమీ తెలియదు అంటూ రోడ్డుపై పరుగులు తీస్తూ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అది చూసిన ఆటో డ్రైవర్ ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు. అర్జెంట్ ఏమో అని అనగా వెంటనే తులసి ఇది షేర్ ఆటో కాదు లిఫ్ట్ ఇవ్వడానికి అని అంటుంది. ఆ తర్వాత సామ్రాట్ ని చూసి ఆటోలో లిఫ్ట్ ఇస్తుంది తులసి.
మరొకవైపు తులసి కుటుంబ సభ్యులు ఎవరి పని వారు చేసుకుంటూ ఉండగా ఇంతలోనే లాస్య దంపతులు అక్కడికి వస్తారు. ఇంట్లో వాళ్లపై అరుస్తారు. ఇంతలోనే తులసి కోసం ఇద్దరూ ఆడవాళ్లు వాయినం ఇవ్వాలని రాగా అప్పుడు లాస్య రెచ్చిపోతూ తులసి ఇప్పుడు మనకు దొరకదు వాళ్ళ బాస్ పక్కన కూర్చుని షికార్లు కొడుతోంది అని అంటుంది లాస్య.
అలా వెళ్లే వారిని మీ ఊర్లో ఏమంటారు అని అనడంతో తిరుగుబోతు అంటారు అంటూ వారితో తులసిని నానా మాటలు అనిపిస్తుంది లాస్య. ఇంతలోనే సామ్రాట్ ఒక ఫైల్ మరిచిపోవడంతో వెంటనే నందుకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకుని ఫైల్ తీసుకొని రమ్మని చెబుతాడు. నందు వాళ్లు కూడా వారితో పాటు వస్తున్నారు అని తెలియడంతో తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత నందు లాస్యలు కూడా ఏర్పాటుకు చేరుకుంటారు.