Karthika Deepam Aug 5 Today Episode : శోభ చెంప చెల్లుమనిపించిన సౌందర్య..నిరుపమ్,శోభ వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించిన స్వప్న..?

Karthika Deepam Aug 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య,హిమ చంప చల్లుమనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య మాట్లాడుతూ ఇప్పటినుంచి అయినా నేను చెప్పేది విను అని అనగా హిమ మాత్రం సౌర్యకీ బావకీ పెళ్లి చేద్దాం అని అంటుంది. దాంతో సౌందర్య కోపంతో నోరు ముయ్యి అని గట్టిగా అరుస్తుంది. ఇంతలోనే అక్కడికి పెళ్లి పనులు చూసుకోవడానికి ఒక ఈవెంట్ మేనేజర్ వస్తాడు. వారికి పెళ్లి పనులు గురించి చెప్పి ఎక్కడ నుంచి పంపిస్తుంది. అప్పుడు సౌందర్య మాటలు సౌర్య వింటూ ఉంటుంది.

మరొకవైపు స్వప్న నిరుపమ్, ప్రేమ్ ల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి శోభ వస్తుంది. సౌందర్య వాళ్ళు పెళ్ళి పనులు మొదలు పెట్టేసారు అనడంతో స్వప్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ప్రేమ్, సత్య రావడం చూసి శోభ సరికొత్త నాటకం మొదలుపెడుతుంది. ఏమి తినకుండా ఉపవాసం చేస్తోంది అని చెప్పడంతో ప్రేమ్ ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నావ్. అప్పుడు సత్య స్వప్నకు ఎంత నచ్చచెడానికి ప్రయత్నించినా కూడా స్వప్న వినిపించుకోదు.

Advertisement

మరొకవైపు సౌందర్య వాళ్ళు భోజనానికి కూర్చుంటుండగా ఇంతలోనే సత్య అక్కడికి వచ్చి మీ మమ్మీ భోజనం తినడం లేదు అని చెబుతాడు. నువ్వు వస్తే కానీ భోజనం చేయను అంటూ మీ మమ్మీ మొండిగా కూర్చుంది ఆడటంతో నిరుపమ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నిరుపమ్ నేను మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తే మళ్లీ రమ్మని పిలుస్తారు ఏంటి డాడీ. మమ్మీ నన్ను ఎందుకు అక్కడికి రమ్మంటుందో మీకు తెలుసు నాకు తెలుసు.

కార్తీక దీపం ఆగస్టు 5 ఈరోజు ఎపిసోడ్ : హిమ మీద కోపంతో శౌర్య ఇంటిని వీడనుందా ?

అక్కడికి పిలిపించి నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోంది మమ్మీ ఇదంతా వట్టి అబద్ధం డాడీ అని అంటాడు. అప్పుడు నిరుపమ్ మమ్మీ ఆ శోభ ని పెళ్లి చేసుకోమని ఏదో ఒక క్షణంలో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అందుకే ఇక్కడికి వచ్చేసాను అని అంటాడు. అప్పుడు సౌందర్య కూడా నా తరపున స్వప్న కి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అని చెబుతుంది. ఆ తర్వాత సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరొకవైపు శోభ,స్వప్న ఒక చోట కూర్చుని ఉండగా ఇంతలోనే సత్య అక్కడికి వస్తాడు. అప్పుడు నిరుపమ్ ఇక్కడికి రాను అన్నాడు అనటంతో స్వప్న,శోభ ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు సత్య నీకు నిరుపమ్ పెళ్లి జరగడం అనేది అసంభవం నీకు మీ ఆంటీ మంచి సంబంధం చూస్తే పెళ్లి చేస్తుంది అనడంతో వెంటనే స్వప్న సీరియస్ అవుతుంది. అప్పుడు స్వప్న సత్య పై సీరియస్ అవుతుంది.

Advertisement
Soundarya fires on Shoba for misleading Sathyam in todays karthika deepam serial episode
Soundarya fires on Shoba for misleading Sathyam in todays karthika deepam serial episode

మరొకవైపు నిరుపమ్, సత్య అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి హిమ వస్తుంది. అప్పుడు హిమ,సౌర్య గొప్పతనం గురించి వివరిస్తూ తన ఫ్యాష్ బ్యాక్ మొత్తం చెబుతుంది. అప్పుడు నిరుపమ్ కీ సౌర్య ని పెళ్లి చేసుకోమని చెబుతుంది. అప్పుడు నిరుపమ్, సౌర్య మనసులో నేను లేను అని అంటాడు. అప్పుడు నిరుపమ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా హిమ సౌర్య ని పెళ్లి చేసుకోమని చెప్పడంతో అక్కడి నుంచి నిరుపమ్ వెళ్ళిపోతాడు.

మరుసటి రోజు ఉదయం సౌందర్య పెళ్లి పనుల గురించి ఈవెంట్ మేనేజర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే నిరుపమ్, స్వప్న దగ్గరికి వెళ్తున్నాను అని అనడంతో హిమ, సౌందర్యలు వద్దు అని చెబుతారు. అప్పుడు ఆనంద్ రావ్ కూడా నిరుపమ్ ని వెళ్ళవద్దు అని చెప్తాడు. ఇప్పుడు అందరూ కలిసి నిరుపమ్ ని ఇంటికి వెళ్లకుండా ఆపేస్తారు. వారందరి మాటలు విన్నసౌర్య హిమ పెళ్లి కోసం ఎంతమంది ఆరాటపడుతున్నారు అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండడం అవసరమా అని అనుకుంటుంది.

మరొకవైపు సత్య భోజనం చేస్తూ ఉండగా ఇంతలోనే శోభ అక్కడికి వస్తుంది. అప్పుడు ఏంటి అంకుల్ ఇది అక్కడ ఆంటీ నిరుపమ్ కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉంటే మీరు మాత్రం కడుపు నిండా తింటున్నారు తినండి అంకుల్ అనడంతో ఇంతలోనే అక్కడికి వచ్చిన సౌందర్య, శోభ చెంప చెళ్ళుమనిపిస్తుంది. ఇంతలోనే అక్కడికి స్వప్న వచ్చి ఏంటి మమ్మీ నా ఇంటికి వచ్చి నా కాబోయే కోడలు కొడుతున్నావు అని అంటుంది.

Advertisement

అప్పుడు సౌందర్య ఇంకొక్క మాట మాట్లాడితే నిన్ను కూడా కొడతాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇదే ముహూర్తాలకి పెళ్లి జరుగుతుంది అంటూ వాళ్లకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సౌందర్య. రేపటి ఎపిసోడ్ లో స్వప్న,నిరుపమ్, శోభ పెళ్లి పత్రికలతో సౌందర్య ఇంటికి వస్తుంది. అప్పుడు సౌందర్య, ఆ పెళ్లి పత్రికలను చింపేస్తుంది. ఇంతలోనే సౌర్య అక్కడికి రావడంతో నిరుపమ్, హిమ ల పెళ్లి చేస్తాను అన్నావు కదా ఆ మాట మీ పొగరుబోతు అత్తకు చెప్పు అని అంటుంది.

Read Also : Karthika Deepam: హిమ చంప చెల్లుమనిపించిన సౌందర్య.. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్న సౌర్య..?

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel