...

Karthika Deepam: హిమ చంప చెల్లుమనిపించిన సౌందర్య.. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్న సౌర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్ లోపల ఉండి ప్రేమ్, హిమ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్లో ప్రేమ్, హిమవచ్చి ఆ ఇంటి తాళాలు పగలగొట్టి వారిని బయటికి తీసుకు వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అప్పుడు సౌందర్య సౌర్య దగ్గరికి వెళ్లి ఏమైంది అమ్మ నిన్ను ఎవరికి ఇడ్నాప్ చేశారు అని అడగగా.. అప్పుడు సౌర్య వెటకారంగా ఈ ఆటో నడుపుకునే దాన్ని ఎవడు కిడ్నాప్ చేశాడు అనె కదా ని ఉద్దేశం అంటూ సౌందర్యని బాధ పెట్టే విధంగా మాట్లాడుతుంది.

అప్పుడు ఆనందరావు ఎందుకు అలా అపార్థం చేసుకుంటావు సౌర్య అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు సౌందర్య ఇంతటితో ఈ టాపిక్ వదిలేయండి అని చెబుతుంది. ఆ తర్వాత వారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అని అనగా వెంటనే సౌందర్య సౌర్య ఎవరో కిడ్నాప్ చేశారు అని అనటంతో వెంటనే స్వప్న, సౌర్య ని కిడ్నాప్ చేస్తే నాకెందుకు అవన్నీ నాకెందుకు చెబుతున్నారు.

నా పిల్లల్ని ఇంకా మీ దగ్గరే ఉంచుకుంటారా మా ఇంటికి పంపరా అంటూ స్వప్న సౌందర్య పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంది. అప్పుడు స్వప్న నా కొడుకులు నీ మనవరాళ్ల కోసమే పుట్టినట్టు నా పిల్లల్ని మాయ చేస్తున్నారు అని అనగా వెంటనే సౌర్య తనదైన శైలిలో గట్టిగా సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత స్వప్న నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో ప్రేమ్,నిరుపమ్ లు స్వప్న పై అరుస్తారు.

అప్పుడు స్వప్న నేను చస్తే గాని నాకు ఈ టెన్షన్ పోయేలా లేదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరొకవైపు శోభ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి స్వప్న వస్తుంది. స్వప్న కోపంగా ఉండటం చూసి శోభ ఏం జరిగింది అంటే అని అడగగా స్వప్న జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు శోభ మనం అనుకున్న విధంగా ప్లాన్ సక్సెస్ అవ్వాలి అంటే రెండు రోజులు మీరు తినడం మానేస్తే నిరుపమ్ మీ ఇంటికి వస్తాడు అంటూ సలహాలు ఇస్తుంది.

మరొకవైపు సౌందర్య ఆనందరావు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు సౌర్య కిడ్నాప్ వెనుక హిమ హస్తం ఉంది అని అనుకుంటారు. మరొకవైపు సౌర్య,నిరుపమ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆనందరావు వస్తాడు. ఆ తర్వాత సౌర్య ఆనందరావు ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు హిమ ఆలోచిస్తూ కిందికి రాగా అందులోనే అక్కడికి సౌందర్య వస్తుంది.

అప్పుడు సౌందర్య హిమకి తన పెళ్లి శుభలేఖ ఇవ్వడంతో హిమ షాక్ అవుతుంది. ఏంటి ఇది అని హిమ అడగక వెంటనే సౌందర్య ఈ సమయానికి నా మనవరాలు మనవడికి పెళ్లి జరుగుతుంది అని గట్టిగా చెప్పడంతో వెంటనే హిమ నానమ్మ బావకి సౌర్యకి పెళ్లి చేద్దాం అని అనడంతో వెంటనే సౌందర్య హిమ చంప చెల్లుమనిపిస్తుంది. ఆ తర్వాత నిరుపమ్,సౌర్య పెళ్లి ఆలోచనలను మానుకో అంటూ హిమకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సౌందర్య.