- ఏపీ, తెలంగాణలో మళ్లీ వానల జోరు.. ఈ జిల్లాల పిడుగులతో జాగ్రత్త
- IMD కీలక హెచ్చరికలు, ఏ జిల్లాల్లో వానలు?
- తెలుగు రాష్ట్రాల్లో మారనున్న వాతావరణం.. భారీ వర్షాలకు ఛాన్స్
Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మారుతోంది. గత కొన్ని రోజులుగా చల్లటి వాతావరణం కొనసాగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం (ఆగస్టు 3) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్న ప్రభావంతో వాతావరణంలో అనేక (Weather Alert) మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది.
Read Also : PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
Weather Alert : ఏయే జిల్లాల్లో వర్షాలు పడనున్నాయంటే? :
తెలంగాణ రాష్ట్రంలోనూ వర్ష సూచనలు ఇంకా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. సిద్దిపేట, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. గోదావరి వరద ఉధృతి రోజురోజుకీ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించారు. అయితే, మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జాగ్రత్తలు సూచించారు.
ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు వాతావరణ పరిస్థితులను గమనించడం ఎంతైనా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వర్షంలో బయటకు రావొద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.













