Potti Mama : అతని పేరు పొట్టి మామ. ఇది వీక్షకులు పెట్టిన పేరు. పేరుకు తగ్గట్లే పొట్టిగా ఉంటాడు. బక్కగా, బట్ట గుండుతో ఉంటాడు. వయస్సు 57 ఏళ్లు. అయితేనేం. పొట్టి మామ స్టెప్పు వేశాడంటే ఉర్రూతలూగాల్సిందే. కవర్ సాంగ్స్ లో పొట్టి మామ అమ్మాయిలతో కలిసే చేసే డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్.

పొట్టిమామ అసలు పేరు రవీంద్ర. శ్రీకాళహస్తి మండలం భీమవరం ఆయనది. చిన్నప్పటి నుంచే నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి. వాళ్ల నాన్నకు అదే పిచ్చి.. దాంతో రవీంద్ర పదో తరగతి చదువుతున్నప్పుడే 4 ఎకరాలు అమ్మి ఆ డబ్బు రవీంద్ర చేతిలో పెట్టాడు. ఇంకేముంది ఆ డబ్బుతో సినిమా మద్రాస్ వెళ్లాడు. కానీ అనుకున్నంత సులభంగా సినిమా ఛాన్సులు రాలేదు. తాను తన వెంట తీసుకెళ్లిన సినిమా, నాటకాల కథలను ఎవరూ దేకలేదు. చేతిలో డబ్బులన్నీ అయిపోవడంతో ఓ హీరోయిన్ ఇంట్లో కుక్కలు చూసే పని చేశాడు.
Potti Mama : పొట్టి మామ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్…
తర్వాత ఆ వ్యక్తి కొన్ని డబ్బులిచ్చి భీమవరం పంపించేశాడు. భీమవరానికి వచ్చిన రవీంద్ర అక్కడిక్కడ పని చేస్తూ కొన్ని రోజులు గడిపాడు. తర్వాత తనకు తెలిసిన, నైపుణ్యం ఉన్న నాటకాలు రాస్తూ వాటి ద్వారా క్రమంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే రవీంద్రకు ప్రజ్వల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. రవీంద్ర ట్యాలెంట్ తో ఓ కామెడీ స్క్రిప్ట్ చేసి దానిని యూట్యూబ్ లో పెట్టాడు ప్రజ్వల్. అలా కామెటీ స్కిట్లు చేస్తూ చేస్తూ కవర్ సాంగ్ లు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రవీంద్రకు, ప్రజ్వల్ కు రాలేదు. క్రమంగా రవీంద్ర పొట్టి మామ అయ్యాడు. పొట్టి మామ చేసే వీడియోలకు ఇప్పుడు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
Read Also : Punch Prasad : రెండో పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్, సోషల్ మీడియాలో రచ్చ..