Punch Prasad : రెండో పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్, సోషల్ మీడియాలో రచ్చ..

Punch Prasad : జబర్దస్త్ లో నటించే చాలా మంది ఒక్క ఎపిసోడ్ తోనే సెలబ్రిటీ అయిపోతున్నారు. ఇలా పాపులర్ అయినా కమెడియన్స్ చాలా మందే ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలన్నా, వారు చేసే స్కిట్లు క్లిక్కు కావాలన్నా.. కంటెంట్ ముఖ్యం. ఆ కంటెంట్ కు తగ్గ పంచ్ లు ఉన్నప్పుడే ఆ స్కిట్లు పేలుతాయి. హైపర్ ఆది అలా కేవలం తన పంచ్ ల వల్లే ఎంత ఫేమస్ అయిపోయాడో తెలిసిందే. అలాగే తన పంచ్ లతో మంచి పేరు సంపాదించుకున్న మరో కమెడియన్ పంచ్ ప్రసాద్. తను వేసే పంచ్ ల వల్ల తనకు పంచ్ ప్రసాద్ అనే పేరు స్థిరపడిపోయింది.

Jabardasth comedian punch prasad second marriage
Jabardasth comedian punch prasad second marriage

తన పంచ్ లు పేలుతుండటం వల్ల తనకు చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కమెడియన్ కు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంత్రి చిన్నా చితకా యూట్యూబ్ ఛానల్స్ పంచ్ ప్రసాద్ పై ప్రత్యేక వీడియోలు చేస్తున్నాయి. ఎందుకంత రచ్చ అనుకుంటున్నారా..? ఎందుకంటే పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడట. అందుకే వాళ్లు అంతగా రచ్చ చేస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చి, కొద్దిగా పేరు రాగానే రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి జరిగిందే నిజమే కానీ, మొదటి భార్యతోనే రెండో పెళ్లి జరిగిందని, అది కూడా జబర్దస్త్ క్రియేటివ్ టీం యొక్క మరో పనికిమాలిన క్రియేటివిటీ అంటూ అసలు నిజం చెప్పేశారు.

Read Also : Vishnu priya : పెళ్లికి సిద్ధమైన యాంకర్ విష్ణుప్రియ, అలాంటి మొగుడే కావాలంటూ!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel