Rashmika mandanna : రష్మిక మందన్న ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె హడావుడియే కనిపిస్తుంది. రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. ఇక రష్మిక సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈమె క్రేజ్ ఫుల్ గా పెరిగిపోయింది. ఇటు తెలుగు.. అటు తమిళ్, హిందీ సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఎక్కడ చూసినా.. రష్మికనే కనిపిస్తుంది. దీనికితోడు రష్మిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా సందడి చేస్తూ ఉంటుంది. ఈ భామ అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో తనకంటూ ఓ పేరును తెచ్చుకుంది.
ఇక తాజాగా రష్మిక ఢిల్లీలో జరిగిన మొదటి ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. రెడ్ కలర్ లెహంగా లో చందమామలా మెరిసిపోతూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.’ మొదటి సారీ ఫ్యాషన్ షో లో పాల్గొనడానికి, ర్యాంప్ వాక్ చేసినందుకు సహాయపడిన వరుణ్ కు థాంక్యూ అంటూ చెప్పకువచ్చి.. ఇది ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.. ఈ పనిని సరదాగా చేసినందుకు మీ టీమ్ కు ధన్యవాదాలు’ అని సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టింది. బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య ర్యాంప్ వాక్ చేస్తూ.. నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.
రష్మిక ఈ డ్రెస్ లో మరింత అందంగా.. హాట్ గా కనిపిస్తుంది అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక రష్మిక నటించబోతున్న పుష్ప2 మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.. రష్మిక, అమితాబ్ బచ్చన్ తో నటిస్తున్న ‘గుడ్ బై’ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక తమిళ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మూవీ ‘సీతరామం’.. ఈ సినిమాలో కూడా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్.. మృణాల్ ఠాకూర్.. రష్మిక నటించిన ప్రేమ కథ చిత్రం సీతారామం .. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలయింది. ఈ సినిమాలో రష్మిక కీలక పాత్రలో నటి సినిమాలో రష్మిక కీలక పాత్రలో నటిస్తోంది.. ఇక ఈ సినిమా ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానుంది.