Viral video: అంతరిక్షంలో టవల్ ఉతికితే ఏం జరుగుతుందో తెలుసా?

Viral video: అంతరిక్షం ఎలా ఉంటుంది, అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల నీళ్లు కూడా తాగలేం, నిల్చోలేమనే సంగతి మనం సినిమాలు, వీడియోలు చూసి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే తాజాగా అంతరిక్షంలో బట్టలు ఉతికితే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో అంతరిక్షంలో ఒకతన టవల్ ను ఉతకడం కనిపిస్తుంది. అయితే ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి. అంతరిక్షంలో గురుత్వాకరణ శక్తి ఉండదు. అలాగే నిల్చోలేం, కూర్చోలేం. మరి అలాంటప్పుడు బట్టలు ఎలా ఉతుకుతామే చూద్దాం.

Advertisement

కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి క్రిస్ హాడ్ ఫీల్డ్ ఐఎస్ఎస్ వద్ద తడి టవల్ తో చేసిన సాధారణ ప్రయోగానికి సంబంధించిన ఓ వీడియోను నాసా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను వాస్తవానికి 2013లోనే నాసా విడుదల చేసింది. కానీ అదిప్పుడు ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది. అంతరిక్షంలో తేలుతున్నప్పుడు తడి టవల్ ని బయటకు తీస్తే ఇది జరుగుతుందనే శీర్షికతో వండర్ ఆఫ్ సైన్స్ పేజీ ద్వారా దీన్ని ట్వీట్ చేశారు. క్రిస్ తడి బట్టని తీస్కొని రెండు చేతులతో పిండుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. గురుత్వాకరణ శక్తి లేకపోవడం వల్ల టవల్ నుంచి వచ్చే నీరు నేలపై పడదు. బదులుగా అది దాని చుట్టూ ట్యూబ్ ని ఏర్పరుస్తుంది. అయితే ఈ వీడియోను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

Advertisement