Viral Video: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ వివిధ రూపాలలో ఉన్న బొజ్జ గణేష్ ప్రతిష్టించుకుని ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాలలో ఉన్న వెరైటీ గణపతులను తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ఆ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఏడాది ఒక విచిత్రమైన గణపతిని తయారు చేశారు. ప్రస్తుతం ఈ వెరైటీ గణపతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో సింహాసనంపై అధిష్టిచ్చిన గణపతికి భక్తులు వచ్చి కాళ్లకు నమస్కరించగానే ఆ వినాయకుడు లేచి నిలబడి తన అభయ హస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన ఈ వినాయక విగ్రహం నిజంగానే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల ఈ వీడియోని దేశంలోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో పాటు, అదునాతన టెక్నాలజీతో తయారు చేసిన వినాయక విగ్రహం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుందని ‘ అంటూ క్యాప్షన్ రాసుకోచ్చాడు.
Viral Video:
ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాలలో ఉన్న వినాయకులను తయారు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మాత్రం అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వెరైటీ వినాయకుడిని తయారు చేశారు. అయితే ఈ వినాయకుడికి సంబందించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియటం లేదు. మొత్తానికి కాళ్ళకు నమస్కరించగానే లేచి భక్తులను ఆశీర్వదించి ఈ వినాయకుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Simple engineering technique that makes the idol so meaningful!
Happy Ganesh Chaturthi pic.twitter.com/rbvpnlTQLAAdvertisement— Harsh Goenka (@hvgoenka) August 31, 2022
Advertisement