Viral video: చింపాంజీలకు మనుషులకు ఉన్నట్లే ఫీలింగ్స్ ఉంటాయి. అవి కూడా మనుషుల్లాగే తమ ఫీలింగ్స్ ను వ్యక్తం చేస్తాయి. బాధ పడతాయి, నవ్వుతాయి, ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి, విచారం, కోపం, ఆవేశం, ఆక్రోశం, ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్క ఫీలింగ్ ను మనిషిలాగే వ్యక్తం చేస్తుంటాయి. పిల్లల పట్ల ప్రేమ కూడా వాటికి చాలా ఎక్కువ. మనిషి పెంచినట్లుగా అవి కూడా తమ పిల్లలను పెంచుతాయి. నైపుణ్యాలు నేర్పిస్తాయి.
మనిషిలాగే చింపాంజీలు సామాజిక జీవులు. అవి గుంపులు గుంపులుగా జీవిస్తాయి. కుటుంబంగా కలిసి ఉంటాయి. అందులో చింపాంజీల గుంపులో కుటుంబ పెద్దలతో పాటు మిగతా వన్నీ ఉంటాయి. కుటుంబ సభ్యుడిని కోల్పోతే మనుషుల్లాగే బాధ పడతాయి. వాటిని ఓదారుస్తాయి.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
ప్రస్తుతం ఇప్పుడు చింపాంజీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాధను మరో వ్యక్తితో పంచుకుంటే అది తగ్గుతుంది. సగానికి సగం భారం దించినట్లు అవుతుంది. కానీ ఆ బాధను అందరితో పంచుకోలేము. అలా వ్యక్తి ఒక దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు. ఆయన మనసులో ఏ బాధ దాగి ఉందో చాలా మదన పడిపోతూ దిగాలుగా కూర్చుని కన్నీరు పెట్టుకుంటున్నాడు. విచారంగా కూర్చున్న ఆ వ్యక్తి వద్దకు వెళ్లిన చింపాంజీ.. అతడిని పట్టుకుని ఓదార్చింది. మొదట అతడి వద్దకు వచ్చింది. మెల్లిగా అతడి భుజాన్ని తడిమింది. చివరలో ఆ చింపాంజీ అతడిని కౌగిలించుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.