Viral Video: గ్లాసులో పాముకు నీళ్లు తాపుతున్న వ్యక్తి..

Updated on: May 27, 2022

Viral Video : సాధారణంగా పామును చూస్తేనే ప్రతి ఒక్కరు భయంతో ఆమడ దూరం పరిగెడతారు.పాము ఒకసారి మనపై దాడి చేసింది అంటే ప్రాణాలపై కొన్నిసార్లు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటాయి. అందుకే చాలామంది పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తారు. అయితే ఇలాంటి పాముకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.చూడటానికి అతి భయంకరంగా నల్లని కారు మబ్బులా ఉన్నటువంటి ఒక పాముకి ఒక వ్యక్తి గ్లాసులో నీళ్ళు తాపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video
Viral Video

సాధారణంగా మనం పాములు పాలు తాగుతాయా అనే విషయం గురించి విన్నాం కానీ నీళ్ళు తాగుతాయి అని వినడం చాలా అరుదుగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ వ్యక్తి ఆ నల్లటి త్రాచుపాముకు నీళ్లు తాపుతూ ఉన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా ఎంచక్క నీళ్లు తాగుతూ ఉన్న ఆపాము ఒక్కసారిగా తల పైకి లేపి తలను బయటికి పెట్టడంతో ఆ వ్యక్తి ఉలిక్కిపడ్డాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే అధిక సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంది. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు పాము ఎంత భయపెట్టింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు అతని ధైర్యసాహసాలు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ భయంకరమైన వీడియోని మీరు చూసి కామెంట్ చేయండి.

Advertisement

Old women dance: పెళ్లిలో బామ్మ డ్యాన్స్.. ఆశ్చర్యంలో బంధువులు.. మామూలుగా లేదుగా!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel