Old women dance : పెళ్లి కొడుకుతో పాటు డ్యాన్స్ చేయాల్సిన పెళ్లి కూతురు పక్కన నిల్చోగా ఓ 80 ఏళ్ల వృద్ధురాలు నల్ల కళ్లద్దాలు పెట్టుకొని మరీ డ్యాన్స్ చేసింది. భర్తతో పాటు ఆ బామ్మ డ్యాన్స్ చేయడం చూసిన పెళ్లి కూతురు పక్కగా నిల్చొని హాయిగా నవ్వుతోంది. మనసులో ఆనందానికి, హుషారుగా ఉండేందుకు మంచి మనసుంటే చాలని ఈ అవ్వ తెలిపింది. ఎనిమిది పదుల వయసులోనూ తాను ఇంత హుషారుగా ఉండేందుకు మనసులో ఎలాంటి కల్మషాలు లేకపోవడమే కారణం అని వివరించింది.

అయితే అవ్వ స్టైల్ కు తగ్గట్లుగా డీజే టిల్లు పాటను పెట్టారు. ఈ పాటకు వరుడితో పాటు బామ్మ మాస్ స్టెప్పులు వేస్తూ… అక్కుడున్న బంధువులందరినీ అళరించారు. అయితే బామ్మ చేసిన డ్యాన్స్ చూసిన వారంతా ఆనందం, ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ప్రెజెంట్ బామ్మ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మోకాళ్ల, నొప్పులు, వెన్ను నొప్పులు అంటూ పట్టుమని 10 నిమిషాలు కూడా సరిగ్గా నిలబడలేని యువతీ యువకులు ఈ బామ్మను చూసి కొంచెం అయినా ఇన్ స్పైర్ అవ్వాల్సిందే.
viral News : భార్య పై ప్రేమతో 90 వేల బైక్ కొన్న యాచకుడు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!