Viral Video : ఇప్పుడు ఇదే ట్రెండ్.. నడిరోడ్డుపై పెళ్లి ఊరేగింపులో పెళ్లికూతురు డ్యాన్స్ లతో రచ్చ చేసేస్తున్నారు. కట్టుకున్న వాడు ఎదుటే ట్రెండింగ్ లో ఉన్న పాటలకు మాస్ స్టెప్పులతో మతిపొగొట్టేస్తున్నారు. పెళ్లి అనగానే ప్రతిఒక్కరికి ఒక మెమెరీ ఉండాలని భావిస్తారు. ఒకప్పుడు ఫొటోలతో సరిపెట్టుకునేవాళ్లు.. ఇప్పుడు అలా కాదు.. ట్రెండ్ మారింది.. పెళ్లి డీజీలో ముందు మాస్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
పెళ్లి వేడుకల్లో పెళ్లికూతుర్లే డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలు ఊరేగింపుగా పెళ్లివేదిక దగ్గరకు వస్తూ డ్యాన్సులు వేశారు. వాడు నడిపే బండి.. వంటి అనేక ప్రైవేటు పాటలకు డ్యాన్స్ వేసి అప్పట్లో ట్రెండ్ అయ్యారు. ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు నేటి పెళ్లి కూతుళ్లు. సోషల్ మీడియాలో వీడియోలను పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తమదైన శైలిలో స్టెప్పులు వేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. పెళ్లి అనగానే పెళ్లి కూతురు డ్యాన్స్ మస్ట్ అనే ట్రెండ్ మొదలైంది. ఒకప్పటిలా సిగ్గుపడుతూ ఉండే పెళ్లిపీటలపైకి వెళ్లే రోజులు కాదని నిరూపిస్తున్నారు. అమ్మాయిలను తక్కువ అంచనా వేయొద్దు.. అంటూ ఇలా తమలోని టాలెంట్ బయటకు తీస్తున్నారు. లేటెస్టుగా ఓ పెళ్లి కూతురు కూడా పెళ్లి ఊరేగింపులో మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టేసింది.
పెళ్లి కొడుకు చూస్తుండగానే వాడు నడిపే బండి పాటతో మొదలెట్టి వరుసగా సామి సామి పాట వరకు మాస్ స్టెప్పులతో ఇరగదీసింది.. అక్కడి వారంతా పెళ్లి కూతురు డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. పెళ్లి కూతురు డ్యాన్స్ చూసి పెళ్లి కొడుకు ఫిదా అయిపోయాడు. నడిరోడ్డుపై పెళ్లికూతురు డ్యాన్స్ వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Read Also : Viral Video : లంగా ఓణీలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టిన అమ్మాయి.. వీడియో వైరల్..!