Guppedantha Manasu Aug 31 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇచ్చిన పెన్ ను చూసి మురిసిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో రిషి కాలేజీ స్టాప్ తో పరీక్షల విషయం గురించి జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. పరీక్షల్లో లోటుపాటు లేకుండా చూసుకోవాలి కాఫీలు జరగకుండా చూసుకోవాలి అని చెబుతూ ఉంటాడు. ఆ తరువాత వసు, రిషి కీ పెన్ ఇచ్చినందుకు థాంక్స్ అని చెబుతుంది. ఆ తర్వాత వసు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళగా అప్పుడు రిషి తన మనసులో ఈ ప్రయాణంలో నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను ఇదే నా ప్రమాణం అని అంటాడు.
మరొకవైపు వసు కూడా రిషి ని తలుచుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రిషి, వసుధార ఎగ్జామ్ ఎలా రాసిందో ఏమి చెప్పలేదు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే గౌతమ్ అక్కడికి వస్తాడు. అప్పుడు గౌతమ్ నీ బాధ ఏంటో నాకు అర్థం అయింది అని వెంటనే వసుధార కి ఫోన్ చేస్తాడు. అప్పుడు గౌతమ్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ వసు అని అడగగా చదువుకుంటున్నాను అని చెబుతుంది.
అప్పుడు గౌతమ్ చెవిలో రిషి తిన్నావా అని అడగమని చెప్పగా, ఎగ్జామ్ ఎలా రాశావు అంటూ అన్ని గౌతమ్ తో అడిగిస్తూ ఉంటాడు. అప్పుడు వసు కూడా ఆ మాటలు అన్నీ కూడా రిషి అడిగి ఇస్తున్నాడు అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు వసుధార నేను పరీక్షలు బాగా రాస్తానని ఒక మాట ఇచ్చాను సార్ ఇప్పటివరకు నన్ను డిస్టర్బ్ చేయడం మంచిది కాదేమో గుడ్ నైట్ అందరికీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
Guppedantha Manasu Aug 31 Today Episode : సరికొత్త ప్లాన్ చేసిన దేవయాని..?
ఆ తర్వాత మరొకవైపు జగతి, మహేంద్రలు చివరి పరీక్ష అయిపోతే వసు, రిషి ఇద్దరు మళ్లీ కలిసే అవకాశం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి రిషి,గౌతమ్ వస్తారు. ఆ తర్వాత అందరూ ఒకరి నుంచి వెళ్లిపోవడంతో దేవయాని ధరణితో కాఫీ పెట్టించుకుని తాగుతుంది. ఆ తరువాత వసు పరీక్షల కోసం చదువుతూ ఉండగా ఇంతలో పుష్ప అక్కడికి వచ్చి ఇప్పుడు కూడా చదువుతున్నావా వసు రేపు మన చివరి పరీక్ష.
ఆ తరువాత నుంచి మనం ఎవరు కలవము అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వచ్చి పరీక్ష ఎలా రాశారు అని అందరిని అడుగుతాడు. అప్పుడు వసుధార మౌనంగా ఉండడంతో నేను అందరినీ అడిగాను అని అనగా బాగానే రాసాను సార్ అని అంటుంది వసు. అప్పుడు రిషి తన మనసులో నీతో మాట్లాడకపోవడం తప్పే వసు కానీ నీ భవిష్యత్తు కోసం ఇంకొక రెండు రోజులు ఆగితే సరిపోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. వసుధర కూడా ఎంత మీరు నాకోసం చేస్తున్నారని నాకు తెలుసు సార్ మీ పేరు నేను నిలబెడతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
Read Also : Guppedantha Manasu Aug 30 Today Episode : వసుకి ప్రేమతో టీ ఇచ్చిన రిషి.. సంతోషంలో వసుధార..?