Guppedantha manasu: కాలేజీకి వసూ లీవ్‌… కళ్లుతిరిగి పడిపోయిన జగతి ?

Guppedantha manasu: “మా” టీవీలో ప్రసారమవుతూన్న ప్రముఖ ధారావాహిక గుప్పెడంత మనసు. మరి 17 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్‌ హెలెట్స్‌ ఏంటో చూసేద్దాం పదండి. వసుధార వాళ్ల అక్క జగతి వాళ్ల ఇంటికి వస్తుంది. వసూ ఎలా ఉన్నావ్‌ చూడక చాలా రోజులు అవుతుంది. ఒక వారం రోజులు లీవ్‌ తీసుకో మా ఇంటికి రా.. నాతో ఉండు అంటుంది. జగతి కూడా వెళ్లిరా వసూ అంటుంది. దానికి వసూ నాకూ వెళ్లాలనే ఉంది కానీ నేను వెళ్తే మీరు ఒక్కరే అవుతారు కదా అంటుంది దానికి జగతి నువ్‌ రాకముందు నేను ఒక్కదాన్నే కదా నాకు ఒంటరితనం అలవాటేలే అంటుంది.

guppedantha manasu latest episode

సరే అని వసూ లీవ్‌లెటర్‌ రాసి జగతికి ఇస్తుంది. ఇక వసు వాళ్ల అక్కతో కలిసి బయలుదేరుతుంది. జగతి కాలేజీలో రిషీకి వసూ లీవ్‌లెటర్‌ ఇస్తుంది. ఏంటి మేడం ఇది అంటాడు రిషీ.. వసూ ఒక వారం రోజు కాలేజీకి రాదు సర్‌ అంటుంది మీకు ఈ లీవ్‌ లెటర్‌ ఇవ్వమని చెప్పింది అంటుంది. ఎందుకు మేడం ఒంట్లో బాగోలేదా వసూకి అంటాడు. కాదు సర్‌ వసూవాళ్ల అక్క వచ్చి వసూని వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది సర్‌ అంటుంది.

Advertisement

ఇంక వసూ లేనన్ని రోజులు వసూని రిషీ బాగా మిస్‌ అవుతూ ఉంటాడు. ఇంక కాలేజీ ముగించుకుని జగతి ఇంటికి వెళ్తుంది. మిషన్‌ ఎడ్యుకేషన్‌ పనిలో నిమగ్నమై ఉంటుంది. సడన్‌గా జగతికి కళ్లుతిరిగినట్టు అనుపిస్తుంది. వెంటనే జగతి మహేంద్రకు ఫోన్‌ చేస్తుంది. కానీ మహేంద్ర ఫోన్‌ ఎత్తడు. దానితో వసూకు ఫోన్‌ చేసిన తనూ ఇప్పుడు ఇక్కడు రాలేదు అందుబాటులో ఉండదు అని ఆలోచించి ఇంక తప్పని సరి పరిస్థితి అనిపించి రిషీకి కాల్ చేస్తుంది జగతి.

ఏంటి జగతి మేడం ఈ టైంలో కాల్‌ చేస్తుంది అనుకుని రిషీ ఫోన్‌ ఎత్తి హలో మేడం చెప్పండి అంటూ ఉంటాడు. రీషీ… అని పిలుస్తుంది కానీ జగతి ఏం చెప్పలేక కళ్లుతిరిగి పడిపోతుంది. ఏంటి మేడం ఏం మాట్లాడదు అనుకుని మరల ఏదో జరగకూడనిది జరిగింది అని అనుకుని హలో మేడం అని అంటూ ఆలోచిస్తాడు కానీ జగతి పడిపోయి ఉండడంతో ఏం మాట్లాడలేదు. మేడం ఏమైనా కావాలనే చేస్తుందా ఫోన్‌ చేసి ఏం మాట్లాడదు అనుకుంటాడు రిషీ. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు రిషీ.. ఇంకజగతిని ఆసుపత్రికి ఎవరు తీసుకెళ్తారు.. రిషీనే వస్తాడా రాడా అనే తరువాతి ఎపిసోడ్‌లో చూడాల్సింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel