Guppedantha Manasu Aug 30 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు తన ఇంటికి వచ్చినట్టుగా ఊహించుకుంటాడు రిషి. మరొకవైపు వసుధార కూడా రిషి గురించి ఆలోచిస్తూ రిషి సార్ ఏం చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు రిషి వసుధారతో ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ తన కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాడు. ఆ వాట్సాప్ గ్రూప్ ని జగతి, వసు ఇద్దరు చెక్ చేసుకుంటారు. అప్పుడు వసు గుడ్ ఐడియా సార్ అని మెసేజ్ చేయగా ఆ మెసేజ్ ని చూసి జగతి మురిసిపోతూ ఉంటుంది.

ఆ మెసేజ్లను చూసి పుష్ప కూడా సంతోష పడుతూ ఉంటుంది. స్టూడెంట్స్ కోసం గ్రూప్ ని క్రియేట్ చేసి వసుధార, కృషి చాటింగ్ చేసుకుంటూ ఉండడంతో అది చూసిన జగతి సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు గౌతమ్,మహేంద్ర,జగతి లు రిషి,వసు విషయంలో ఆలోచించుకుంటూ వీళ్ళు ఇలాగే ఉంటే ఎప్పటికీ కలవరు ఏం చేయాలి. కనీసం వీళ్ళు మాట్లాడుకోవడం లేదు ఫోన్లు కూడా చేసుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటారు.
అప్పుడు మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు జగతి రిషి క్రియేట్ చేసిన గ్రూప్ గురించి చెబుతూ అందులో వసు, రిషి చాటింగ్ గురించి చెప్పడంతో గౌతమ్, మహేంద్ర ఇద్దరూ సంతోషపడతారు. అప్పుడు వసు కరెంటు పోయింది సార్ అని అనడంతో ఆ మెసేజ్ చదివిన మహేంద్ర ఇప్పుడు మన పుత్ర రత్నం కారు తీసుకొని అక్కడికి వెళ్తాడు అని అంటాడు. మహేంద్ర చెప్పిన విధంగానే రిషి కారు తీసుకొని వెళ్లడంతో జగతి,గౌతమ్ ఇద్దరు షాక్ అవుతారు.
Guppedantha Manasu Aug 30 Today Episode : రిషి వచ్చిడనే సంతోషంలో వసు…
అప్పుడు జగతి నవ్వుతూ మహేంద్ర నీకు కూడా చాలా తెలివితేటలు వచ్చాయి అనడంతో వారు ముగ్గురు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు వసు కరెంటు కోసం ఎదురుచూస్తూ ఎంతసేపటికి రాకపోయేసరికి బుక్స్ తీసుకొని చదువుకోవడానికి బయటకు వెళ్తుంది. అక్కడ చందమామతో ఒంటరిగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోరే రిషి కారు వేసుకుని వస్తాడు. రిషి ని చూసిన వసు ఒక్కసారిగా సంతోషపడుతుంది.
అప్పుడు లైట్లు అలాగే ఉంటాయి నువ్వు చదువుకో అని చెబుతాడు రిషి. అప్పుడు వసుధర చదువుకుంటూ ఉండగా ఇంతలోనే రిషి, వసు కోసం టీ ని తీసుకొని వస్తాడు. ఆ టీని తాగుతూ వసు,రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార కరెంటు రావడంతో అక్కడి నుంచి వెళ్తూ థాంక్స్ ఫర్ టీ అని పేపర్లో రాసి వెళ్లిపోతుంది. అది చూసిన రిషి సంతోషపడతాడు. ఇక మనసరి రోజు ఉదయం రిషి కాలేజీకి వచ్చి వసు ఇంకా రాలేదా అని ఎదురు చూస్తూ ఉండగా మరొకవైపు వసుధార కూడా ఇంకా రిషి సార్ రాలేదా అని ఎదురు చూస్తూ ఉంటుంది.
ఆ తర్వాత వసు స్టూడెంట్స్ తో కలిసి మాట్లాడుతూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పి వారిని మాటల్లో పెట్టి, వసు కోసం తీసుకొని వచ్చిన పెన్నును తన బ్యాగ్ లో పెడతాడు. ఆ తర్వాత వసుకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు తన బ్యాగులో పెన్ను ను చూసి చాలా సంతోషపడుతుంది. దూరం నుంచి అది గమనించిన రిషి సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు మీరు జెంటిల్మెన్ సర్ ఇలాంటి చిన్న చిన్న వాటిలో కూడా ఆనందాలు వెతుక్కుంటారు అని అనుకుంటూ ఉంటుంది.
- Guppedantha Manasu Nov 1 Today Episode : దగ్గరవుతున్న వసుధార రిషి.. మహేంద్ర రిషి ని కలిపి ప్రయత్నంలో గౌతమ్..?
- Guppedantha Manasu serial Sep 16 Today Episode: వసు,రిషి ల ఏకాంతాన్ని చెడగొట్టిన దేవయాని..రిషి ని హత్తుకున్న వసు..?
- Guppedantha Manasu Aug 18 Today Episode : దేవయానికి గోరుముద్దలు తినిపించిన రిషి.. ఆనందంతో పొంగిపోతున్న జగతి..?















