Guppedantha Manasu September 8 Today Episode : ప్రేమలో మునిగి తిరుగుతున్న వసు,రిషి.. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్..?

Guppedantha Manasu September 8 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని వసుధార పని చేసే రెస్టారెంట్ కి వస్తుంది.  ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని వసుధారతో మాట్లాడుతూ మహేంద్ర జగతిల పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవాలని అనుకుంటున్నాము అందుకోసం నువ్వు రిషి ని ఎలా అయినా ఒప్పించాలి అని అంటుంది. అప్పుడు వసు అది నాకు ఎలా సాధ్యం మేడం అని అడగగా సాధ్యం అవ్వాలి. రిషి ని నువ్వే ఒప్పించాలి అని అంటుంది. అప్పుడు వెంటనే వసు రిషి సార్ మీ మాట బాగా కాదన్నాడు కదా మేడం అని అనగా సాక్షి విషయంలో అలా జరిగినప్పటి నుంచి రిషి నా మాట వినడం లేదు అని అంటుంది దేవయాని.

Advertisement
Vasudhara and Rishi spend some quality time in todays guppedantha manasu serial episode
Vasudhara and Rishi spend some quality time in todays guppedantha manasu serial episode

ఇంతలోనే అక్కడికి రిషి వచ్చి మీరేంటి పెద్దమ్మ ఇక్కడికి వచ్చారు అని అనగా ఏమీ లేదు రిషి అని చెప్పడంతో వెంటనే వసుధార రిషికి దేవయానికి కాఫీ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు కలిసి ఒక చోటికి వెళ్తారు. ఆ తర్వాత గౌతమ్, రిషి, వసు లకు ఒకరికి తెలియకుండా ఒకరికి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెబుతాడు.

Advertisement

ఇక అక్కడికి వసు, రిషి వచ్చే చూస్తే అక్కడ గౌతం ఉండడు మొత్తం అంతా కూడా డెకరేషన్ చేసి ఉంటుంది. మరొకవైపు గౌతమ్ ఒక కారులో కూర్చొని రిషికి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వసూ, రిషి ఇద్దరు అక్కడ ఒక టేబుల్ ఉండగా అక్కడికి వెళ్లి కూర్చుంటారు. అప్పుడు వసుధార చుట్టూ అంత చూసి చాలా బాగుంది కదా సార్ అని అంటుంది. ఇంతలోనే గౌతమ్ రిషికి మెసేజ్ చేసి అలా ఖాళీగా ఉండకుండా తింటూ మాట్లాడుకోండి అని మెసేజ్ చేస్తాడు.

Advertisement

Guppedantha Manasu September 8 Today Episode : ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్..

అప్పుడు రిషి నేను సర్వ్ చేస్తాను అని చెప్పి వసు కీ భోజనం వడ్డిస్తాడు. అప్పుడు వారు ఒకరిని చూసుకుంటూ మరొకరు తింటూ ఉంటారు. ఇంతలోనే అనుకోకుండా రిషి తింటున్న స్పూన్ కిందకి పడిపోగా అప్పుడు రిషి వెంటనే వసుధర తింటున్న స్పూన్ ని తీసుకొని తింటాడు. దాంతో వసుధర సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది.

Advertisement

ఆ తరువాత వసుధర చందమామను చూసుకుంటూ మాట్లాడుతూ ఉండగా వెంటనే రిషి ఈరోజు నువ్వు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడటం ఆపేసి నాతో మాట్లాడతావా అని అంటాడు. అప్పుడు వసు నవ్వుతూ సరే అని అంటుంది. ఆ తర్వాత వారిద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

ప్రేమికులు గంటలకు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నాకు మాటలు రావడం లేదు అని రిషి అనగా వెంటనే వసుధర కొన్నిసార్లు మౌనం కూడా సంభాషణే సార్ అని అంటుంది. అంతలో గౌతమ్, భోజనం అయిపోయిందని ఖాళీగా ఉండకండి అక్కడ గ్రీన్ టీ ఉన్నది దాన్ని తాగుతూ సమయం గడపండి అని మెసేజ్ పెడతాడు. అప్పుడు రిషి, వసుధారలు ఇద్దరూ టీ తాగుతూ ఉంటారు.

Advertisement

Read Also : Guppedantha Manasu: రిషి ప్రేమ పరీక్షలో గెలిచిన వసు..సంతోషంలో జగతి దంపతులు..?

Advertisement
Advertisement