Guppedantha Manas seurial Sep 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా అప్పుడు రిషికీ జగతి భోజనం వడ్డించగా రిషి వద్దు అన్నట్లుగా ఊహించుకుంటుంది దేవయాని. కానీ దేవయాని దానికి వ్యతిరేకంగా జగతి రిషికి వడ్డించిన కూడా రిషి ఏమి అనడు. దాంతో దేవయాని ఇదంతా వసుధార వల్లేనా అంటూ మీ మధ్య ఎలా అయినా దూరం పెంచాలి అని అనుకుంటూ ఉంటుంది దేవయాని.
మరొకవైపు వసుధార బుక్స్ సర్దుకుంటూ ఉండగా ఇంతలోనే జగతి ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన వసు హలో రిషి సార్ అని అంటుంది. ఇప్పుడు జగతి నవ్వుకొని ఇన్ని రోజులు మీ మధ్య ఏముంది అని అడిగితే చెప్పలేదు ఈరోజు నిజం చెప్పు అని అడుగుతుంది జగతి. అప్పుడే రిషి ఫోన్ చేయడంతో అప్పుడు వసుధార సార్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కోప్పడతాడు అని చెప్పగా జగతి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు చూసి ఎవరి ఫోన్లో అనడంతో జగతి మేడమ్ సార్ అని చెబుతుంది.
Guppedantha Manas seurial Sep 7 Today Episode : సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?
అప్పుడు రిషి,వసు ను మా ఇంటికి రావచ్చు కదా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అంటాడు. కావాలంటే నేను మా పెద్దమ్మతో మాట్లాడతాను అని అనడంతో వసుధార ఆశ్చర్య పోతుంది. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత వసుధార సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మరోవైపు మహేంద్ర తన ఫ్రెండు కొడుకు పెళ్లి కార్డు పట్టుకుని వచ్చి మన ఇంట్లో కూడా శుభకార్యం జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు.
ఇప్పుడు జగతితో మన పెళ్లి ఈ వారంలోనే ఉంది కదా అని అనగా జగతి మన పెళ్లి రోజులు జరుపుకునే పరిస్థితి ఇప్పట్లో లేదు అని అంటుంది. ఇంతలోనే వారి మాటలు నిన్న గౌతం వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతాడు. ఆ తర్వాత దేవయాని వసు ఉండే రెస్టారెంట్ కి వెళ్లి నాకు ఒక సహాయం చేయాలి. కుటుంబమందరు కలిసి ఉండాలి నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి జగతి, మహేంద్ర పెళ్లిరోజు వారంలోనే ఉంది కాబట్టి నువ్వే రిషికి దగ్గరుండి ఒప్పించాలి అని ఏర్పాట్లు చేయాలి అనడంతో వసుధార ఆశ్చర్య పోతుంది. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి దేవయాని పలకరిస్తాడు.
Read Also : Devatha Sep 7 serial Today Episode : దేవి పై బెంగపెట్టుకున్న చిన్మయి.. సంతోషంలో దేవుడమ్మ.?