Guppedantha Manasu September 9 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు,రిషి ఒకచోట కలిసి ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో రిషి మాట్లాడుతూ ఎగ్జామ్స్ అయిపోయాయి కష్టపడి చదివి ఒంట్లో బాగ లేకపోయినా పరీక్షలు బాగానే రాశావు. ఈ సందర్భంగా నీకు ఏదైనా ఇవ్వాలని ఉంది ఏదైనా కోరుకో వసుధార నెరవేరుస్తాను అని రిషి అనగా వెంటనే వసు తర్వాత మెసేజ్ చేస్తాను సార్ అని చెబుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన రిషి అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. తనలో తానే మాట్లాడుకుంటూ సంతోషంగా కనిపిస్తాడు.

అప్పుడు వసుధారతో గడిపిన క్షణాలను గుర్తుతెచ్చుకొని ఆనంద పడుతూ ఉంటాడు. ఇంతలోనే వసుధారకి మెసేజ్ చేద్దాం అనుకుంటూ ఉండగా అప్పుడు వసుధార వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. సర్ మీరు నన్ను ఒక కోరిక కోరమని అడిగారు కదా ఇప్పుడు అడుగుతున్నాను సార్ జగతి మేడం మహేంద్ర సార్ పెళ్లి రోజు ఒక వారంలో ఉంది దానిని మీరు సెలబ్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అది కూడా మీ ఇంట్లోనే అని అనడంతో వసుధార కోరిక విన్న రిషి షాక్ అవుతాడు.
అదే విషయం గురించి మరుసటి రోజు ఉదయం కలిసిన వాసు రిషి ఎందుకు వసుధర అందరూ ఎక్కువ ఆశిస్తారు. ఇప్పటికే జగతి మేడం విషయంలో నేను ఎన్నో మెట్లు దిగి వచ్చాను. మీ మేడంకి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను అయినా కూడా నువ్వు ఎందుకు ఇంతలా తాపత్రయ పడుతున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు వసుధార సర్ మీరు జగతి మేడం కోసం చేస్తున్నాను అనుకోవద్దు.
Guppedantha Manasu : సెలబ్రేషన్ కి, సంబరానికి వసు ఇచ్చిన క్లారిటీ రిషిని ఒప్పిస్తుందా ?
అందులో మహేందర్ సార్ కూడా ఉన్నారు కదా. ఆయన బాధపడతారు. మీకు మహేంద్ర సార్ అంటే ప్రాణం. మహేంద్ర సార్ కి జగతి మేడం అంటే ప్రాణం కనుక మీరే ఆలోచించండి. నేను చెప్పాల్సింది చెప్పాను సార్ తర్వాత మీ ఇష్టం. మిమ్మల్ని బలవంత పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఒకవేళ మీరు ఆ పార్టీ వద్దు అన్నా కూడా ఎందుకు అని కూడా నేను అడగను ఎందుకు అంటే మీరు ఏదైనా మాట ఇస్తే మాట తప్పదు అని నమ్మకం నాకు ఉంది అని అంటుంది వసు.
మరొకవైపు జగతి తన జీవితంలో జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే మహేంద్ర జగతి కోసం పెళ్లి రోజు గిఫ్ట్ గా చీర తీసుకొని వస్తాడు. కానీ జగతి మాత్రం ఎందుకు ఇవన్నీ ఇప్పుడు మహేంద్ర అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మనం పెళ్ళి రోజు జరుపుకొని రిషిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఆలోచన అనే విరమించుకో మహేంద్ర అని చెబుతుంది జగతి. మనం భార్యాభర్తలమే కాకుండా తల్లిదండ్రులను కూడా మన ఆనందం రిషి ని బాధ కలిగించకూడదు. రిషి నీ బాధ కలిగించే ఆనందం మనకు అవసరం లేదు. అని అనడంతో ఆ మాటలు చాటుగా విన్న రిషి ఆలోచనలో పడతాడు.