Upasana: హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమెకు, చెర్రీకి పెళ్లై పదేళ్లు అవుతున్నా వారు ఇంకా పిల్లల్ని కనలేదు. అయితే ఇదే విషయం గురించి సద్గురును కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆథ్యాత్మి గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. అవేంటో, వాటికి సద్గురు చెప్పిన సమాధానాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నేను వివావహం చేస్కొని పదేళ్లు అవుతోంది. నా జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. అయితే ఆర్ఆర్ఆర్ అంటే సినిమా అనుకునేరు అది కాదు. ఆర్ఆర్ఆర్ అంటే రిలేషన్, రీ ప్రొడక్షన్, రోల్ ఇన్ లైఫ్. వీటి గురించే నన్ను ఎక్కువగా ప్రశ్నిస్తుంటారు. మీరు చెప్పండంటూ ఉపాసన ప్రశ్న అడిగింది. ఇందుకు సద్గురు మొదటిది నీ పర్సనల్. దాని గురించి నేను మాట్లాడను. రెండోది పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను అబినందిస్తాను.
ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా 10 కోట్లు సమీపిస్తోంది. మనం అంతరించిపోయే జీవులం కాదు.
ఒకవేళ మీరు పులి అయి.. మీ జాతి అంతరించిపోతుంటే పిల్లల్ని కనమని చెప్తాను. కానీ మనుషులు అలా చెప్పనంటూ సద్గురు వివరించారు. అయితే ఉపాసన అడిగిన ఈ ప్రశ్నల గురించి.. నెట్టింట తెగ చర్చ నడుస్తోంది అయితే కొందరు ఉపాసనను మెచ్చుకుంటుండగా.. మరికొందరేమో మాతృ్తవం చాలా గొప్పదని.. దాని మిస్ అవ్వొద్దంటూ సలహాలు ఇస్తున్నారు.
Read Also : Ram charan fires on fans : మెగా వర్సెస్ అల్లు వివాదం.. అభిమానులపై మండిపడ్డ చెర్రీ!