Ram charan fires on fans : గత కొంత కాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య తీవ్ర వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ సపోర్టుతోనే అల్లు అర్జున్ స్టేటస్ తెచ్చుకున్నారని… ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఆయన పట్టించుకోవడం లేదంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే తమ అభిమాన హీరోని మెగా ఫ్యాన్స్ అలా అనడం నచ్చక వారు కూడా మెగా ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే ఈ వివాదానికి కారణఁ అయిన వ్యక్తి మీద రామ్ చరణ్ తేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ పేరు ప్రస్తావించనందుకు ఇదంతా గొడవ మొదలైంది ఎందుకు ఆయన పేరు తీయలేదంటూ అల్లు ఫ్యాన్స్ అడగ్గా… నేన తీయను బ్రదర్… మీరేం పీకలేరంటూ భవాని రవి కుమార్ అన్నారు. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు… గొడవకు దిగారు. అయితే ఈ విషయంపై చెర్రీ భవాని రవి కుమార్ పై కోప్పడగా… క్షమాపణ చెబుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
తాజాగా జరిగిన సమావేశంలో తాను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ గారు అని సంబోధిస్తూ…. మాట్లాడడం సరి కాదని… దీనిపై రామ్ చరణ్ గారు కూడా తన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందని రవి కుమార్ ఆ వీడియోలో వెల్లడించారు.
Ram charan: మదర్స్ డేకు సూపర్ వీడియో షేర్ చేసిన రామ్ చరణ్.. చూసి తీరాల్సిందే