Intinti Gruhalakshmi: ఒకటైన నందు,లాస్య, సామ్రాట్.. తులసి మీద పగబట్టిన సామ్రాట్.?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సామ్రాట్ జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి గారు ఎందుకు ఫోన్ చేయలేకపోతున్నారు. నాతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు తులసి కూడా నాకు ఎటువంటి భయం లేదు కానీ సామ్రాట్ గారు నేను చెప్పే మాటలు నమ్ముతాడో లేదో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే తులసి నుంచి మెసేజ్ రావడంతో సామ్రాట్ అది ఓపెన్ చేయగా ఇందులో తులసి తన వ్యాపార భాగస్వామి వదులుకుంటున్నట్టు మెసేజ్ చేయడంతో అది చూసి సామ్రాట్ షాక్ అవుతాడు.

Advertisement

ఆ తర్వాత సామ్రాట్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ కోపాన్ని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ మీద చూపించగా వెళ్లి ఒకసారి అడుగు తులసి కన్విన్స్ అవుతుందేమో అని అంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ కేవలం తులసి ఒకటే తప్పు చేసిన నందు కూడా తప్పు చేశాడు కదా ఆ విషయం తాను కూడా చెప్పలేదు కదా అని అంటాడు. కానీ నందు మాత్రం తులసిని తప్పుగా అపార్థం చేసుకుంటూ మాట్లాడతాడు.

Advertisement

మరొకవైపు శృతి గదిలో బట్టలు ఎదుగుతూ ఉండగా తన బట్టలు కనిపించకపోవడంతో దివ్య ని అడుగుతుంది. అప్పుడు దివ్య ప్రేమ్ అన్నయ్య తీసుకెళ్లాడు అనడంతో వెంటనే బయటికి పరుగులు తీస్తుంది శృతి అలా వారిద్దరూ కాసేపు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు ప్రేమ్ శృతిని ఆట పట్టిస్తాడు. ఒకవైపు నందు లాస్య మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. అప్పుడు తులసిని చూసిన నందు లాస్య వెటకారంగా మాట్లాడిస్తారు.

అప్పుడు తులసి మీరే నా మాజీ భర్త అన్న విషయాన్ని మీరు నన్ను చెప్పనివ్వకుండా చేశారు అన్న విషయాన్ని సామ్రాట్తో చెప్పండి అనడంతో నందు లాస్య పకపక నవ్వుకొని తులసిని అవమానించే విధంగా మాట్లాడుతారు. అప్పుడు నందు ప్రవర్తనతో విసిగిపోయిన తులసి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నేను మీ జీవితానికి అడ్డు వచ్చానా అంటూ కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

ఇక రేపటి ఎపిసోడ్ లో నందు లాస్య సామ్రాట్ దగ్గరికి వెళ్లి తులసీపై లేనిపోనివన్నీ చెప్పి సామ్రాట్ ని మరింత రెచ్చగొడతారు. అప్పుడు సామ్రాట్ తులసి పై కోపంతో రగిలిపోతూ ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి అంటూ నందు లాస్యల హెల్ప్ తీసుకుంటాడు.

Advertisement