Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి నందు, లాస్య ల దగ్గరికి సహాయం కోసం వెళ్లగా ఘోరంగా అవమానిస్తారు.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా సామ్రాట్ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నందుకు ఎందుకు సామ్రాట్ ఎవరికి అపార్ట్మెంట్ ఇవ్వలేదు మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నావు అని వాళ్ళ బాబాయ్ అడగగా ఈ కంపెనీ సీఈవో నేను నా ఇష్టం బాబాయ్ అంటూ వాళ్ళ బాబాయ్ పై కోప్పడతాడు. అప్పుడు సామ్రాట్ కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే అక్కడికి నందు లాస్య వస్తారు. అప్పుడు సామ్రాట్, నందు, కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు నందు లాస్య కావాలనే తులసిని ఇరికించే విధంగా మీకు నందు తులసి మాజీ భర్త అన్న విషయం తెలుసు అనుకున్నాము సార్ అంటూ తులసిని అడ్డంగా ఇరికిస్తారు.
అప్పుడు నందు లాస్య వాళ్ళు టెన్షన్ తో ఉండగా వెంటనే సామ్రాట్ మీకు ఒక పని చెబుతాను మీరు వెళ్లి తులసిని ఎలా అయినా ఒప్పించి కంపెనీలోలీ తీసుకురండి లేకపోతే రావద్దండి అని అంటారు సామ్రాట్. దీంతో నందు లాస్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇద్దరూ బయటికి సామ్రాట్ ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య వెళ్దాం పద అని అనగా నందు మాత్రం నేను రాను అని అంటాడు. నందు లాస్య ఇద్దరు మొహమాటంగా తులసి ఇంటికి వెళ్తారు.
అప్పుడు అనసూయ బయట కనిపించడంతో టెన్షన్ పడుతూ అక్కడికి వెళ్తారు. వచ్చి రావడంతోనే అనసూయ వారిద్దరికీ చివాట్లు పెట్టి అక్కడి నుంచి కోపంగా కసురుకొని పంపించేస్తుంది. ఆ తర్వాత ఆ పరంధామయ్య ఫోన్లో మాట్లాడుతూ నందు వచ్చి పక్కన కూర్చున్నా కూడా ఎవరో తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అప్పుడు నాన్న నీతో మాట్లాడాలి అనడంతో వెంటనే పరంధామయ్య నందుకి తగిన విధంగా బుద్ధి చెప్పి తులసి లోపల ఉంది వెళ్ళు అని చెబుతాడు.
అప్పుడు నందు లాస్య పై కోపంతో అందరూ నాతో ఆట ఆడుకుంటున్నారు అని లోపలికి వెళ్తాడు. అప్పుడు తులసి వారిని చూసి తన పని తాను చేసుకుంటూ ఉండగా అప్పుడు లాస్య నందు నీతోనే మాట్లాడాలని వచ్చాడు తులసి అని అంటుంది. అప్పుడు తులసి తనని నందు దంపతులు అవమానించిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్లకు కూడా తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతుంది తులసి.
దీంతో నందు లాస్యలు అందరి ముందు అవమానంగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన నందు లాస్యలు తులసి గురించి ఆలోచిస్తూ ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో తులసి ఇంటి దగ్గరికి ప్రెస్ వాళ్ళు వచ్చి సామ్రాట్ భాగస్వామిని వదులుకున్నారంట కదా అని మింద మీద ప్రశ్నలు వేస్తారు. ఆ తర్వాత సామ్రాట్ అక్కడికి వచ్చి నేను మీకు ఏమి అపకారం చేశాను ఎందుకు ఇలా చేస్తున్నారు పేపర్లోకి ఎక్కాల్సిన అవసరం ఏముంది అంటూ తులసి పై కోప్పడతాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World