Remedy for nagadosham : మనలో ప్రతి ఒక్కరికి నిత్యం ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారు కొన్ని పరిహారాలను పాటించి తమ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు. అయితే కొందరు వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ సమస్యల నుంచి బయట పడలేరు. అలాంటి వారంతా నవగ్రహ దోషాలతో బాధపడుతున్నట్టేనని పండితులు చెబుతున్నారు. వీటన్నింటిని సంగతి పక్కన పెడితే భారతీయ తాంత్రిక, మాంత్రిక, వైదిక ఆచారాలతో మొలకెత్తిన ధాన్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
వీటిని ఎక్కువగా దేవాలయాల్లో కలశ పూజల్లో వాడుతుంటారు. ముఖ్యంగా నువ్వులు, అక్షింతలు ఎక్కువగా వాడుతుంటారు. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందడానికి తిలహవనం కూడా నిర్వహిస్తారు. శ్మశాన వాటికలో సహా భూముల్లో మట్టిని శుద్ధి చేసేందుకు కొత్త ధాన్యాలను వాడుతుంటారు. అయితే ఈ ధాన్యాలతో నవ గ్రహాల దోషాల నుంచి విముక్తి పొందొచ్చు. ఈ సందర్భంగా నవగ్రహ దోషాల నుంచి ఇబ్బందులు ఎదుర్కునేవారు పరిహారాలను పాటించాలి.
ఎలాంటి ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీకు త్వరగా మంచి ఫలితాలు వస్తాయనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడికి బియ్యం, అంగారకుడికి తువ్వరా, బుధుడికి శనగలు, గురుడికి శనగలు శుక్రుడికి ముతీర, శనికి నువ్వులు, రాహు, కేతువులకు బార్లీ ధాన్యాలతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల నవ గ్రహ దోషాల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్య పరంగా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు.
Read Also : Devotional: గోమాతకు ఈ ఒక్కటి పెడితే చాలు.. ఎంతో మంచి జరుగుతుంది