Nandi kommulu : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకు. అయితే ఒక్కో దేవుడిని ఒక్కోలా పూజిస్తుంటాం. ఏ దేవుడికి నచ్చిన పద్ధతిలో వారిని పూజిస్తూ.. వారి సంతృప్తి పడేలా పూజలు, పునస్కారాలు కూడా చేస్తుంటాం. అయితే శివుడు అభిషేక ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయనకు ఎక్కువగా అభిషేకాలు చేస్తుంటారు.
అంతేనా మనం ఏ శివాలయానికి వెళ్లినా అక్కడ స్వామి వారు లింగ రూపంలోనే దర్శనం ఇస్తుంటారు. అందులోనూ ఆయనకు ముందు నందీశ్వరుడు ఉంటాడు. అయితే నంది కొమ్ముల మధ్య నుంచి మాత్రమే శివుడిని చూడాలని చాలా మంది నమ్ముతుంటారు. మరికొందరేమో అలా చూడకూడదని అంటారు.
అసలు అలా చూడొచ్చా.. చూస్తే ఏమవుతుందనే విషయాల గురించి మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.
అయితే ఆలయంలోని విగ్రహ మూర్తులను ఎక్కువగా స్పృశించకూడదని… అందులోనూ నందీశ్వరుడిని అస్సలే ముట్టుకోకూడనది పండితులు చెబుతున్నారు. ఎందుకంటే నందీశ్వరుడు శివధ్యాన పరాయణుడు. ధ్యానం చేస్తున్నప్పుడు మన ఎవరినీ తాకకూడదట. దాని వల్ల వారి ధ్యానానికి భంగం వాటిల్తుతుంది. దీని వల్ల దోషం పట్టుకుంటుందని చెబుతున్నారు.
Read Also : Shiva Linga Puja Niyamas : శివలింగానికి ఇవి అస్సలు సమర్పించకూడదు.. ఎందుకంటే ?