...

Karthika Deepam: సౌర్య పై కోపంతో రగిలిపోతున్న శోభ.. స్వప్న పై కోప్పడిన సౌర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో తన తప్పు తెలుసుకున్న స్వప్న మారిపోయి సత్యం కు క్షమాపణలు అడుగుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న నన్ను క్షమించండి ఒక్క మాట నేను చాలా ఏళ్ల ముందు అడగాల్సింది తప్పు చేశాను నన్ను క్షమించండి అని అంటుంది. ఆ తర్వాత స్వప్న సత్య ఇద్దరు ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుని దగ్గరవుతారు. మరొకవైపు శౌర్యం ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నిరుపమ్ అక్కడికి వచ్చి శౌర్య కళ్ళు కప్పుగా సౌర్య వెంటనే డాక్టర్ సాబ్ అని అనడంతో అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు అని అనగా, ఇది కూడా చెప్పలేనా అని అంటుంది శౌర్య.

అప్పుడు జరిగిన విషయానికి నిరుపమ్ సారీ చెప్పడంతో దాన్ని సౌర్య తప్పుగా అపార్థం చేసుకొని నన్ను వదిలేయండి నన్ను మాట్లాడించకండి అని నిరుపమ్ కి చేతులు జోడించి ముక్కుతుంది. మరొకవైపు సౌర్య ఒంటరిగా కూర్చొని ఉండగా ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి గోరింటాకు పెడతాను అని అనడంతో సౌర్య వద్దు అని అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన హిమ,నిరుపమ్ అది చూసి సంతోష పడతారు.

అప్పుడు నిరుపమ్ కూడా గోరింటాకు పెట్టుకో శౌర్య మంచి మొగుడు వస్తాడు అని అనగా వెంటనే సౌర్య కోపంతో నాకు మంచి మొగుడు అవసరం లేదు హిమకు వస్తున్నాడు కదా మంచి మొగుడు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య. మరొకవైపు శోభ ఇంట్లో బ్యాంక్ మేనేజర్లు బంగారం డబ్బు ఆస్తి పత్రాలు అని చెక్ చేస్తూ ఉండగా శోభ మాత్రం జరిగిన విషయాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

మీ ఇంటిని మీ హాస్పిటల్ ని కూడా సీట్ చేస్తున్నాము అని చెప్పి శోభ సంతకం కూడా తీసుకుంటారు. ఇక వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత శోభ శౌర్య అంటూ గట్టిగా అరుస్తుంది. మరొకవైపు సౌర్య ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. ఎందుకు శౌర్య ఒంటరిగా ఉంటున్నావు అందరూ ఒకచోట ఉంటున్నారు కదా అని అనగా.

మీ అందరికీ హిమ అంటే ఇష్టం చిన్నప్పుడు నేను తప్పిపోయినప్పుడు కూడా నన్ను వెతకడానికి మీరు రాలేదు. కానీ ఇప్పుడు నేనే అసలు సౌర్య అని తెలుసుకొని నా మీద లేని ప్రేమలు అన్ని చూపిస్తున్నారు అని అంటుంది సౌర్య. చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత కనీసం మీరు నాకోసం వెతకలేదు.

నేను మీకు కనిపించనంత దూరం అయితే వెళ్లలేదు వెతికితే దొరికే అంత దగ్గరలోనే ఉన్నాను కానీ కనీసం ప్రయత్నం కూడా మీరు చేయలేదు అని వాళ్ళని అపార్థం చేసుకుంటుంది సౌర్య. అప్పుడు సౌర్య చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను తలుచుకుంటుంది. చిన్నప్పుడు సౌర్య పిన్ని బాబాయ్ దగ్గర ఒక చోట కూర్చుని ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి వచ్చి ఎలా ఉన్నావు సౌర్య అంటూ ఎమోషనల్ అవ్వగా.. మీకు నాకంటే హిమని కావాలి.

మా అమ్మానాన్నలు ఎప్పుడైనా వస్తారు అనే నమ్మకం ఉంది వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడి నుంచి వెళ్లకపోతే నా మీద ఒట్టే అని అంటుంది శౌర్య. అప్పుడు సౌందర్య ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో స్వప్న సౌర్య, హిమ కోసం బట్టలు తీసుకుని వచ్చాను అని అనటంతో అప్పుడు సౌర్య స్వప్న తప్పుగా అపార్థం చేసుకుని అందరి ముందు అవమానించే విధంగా మాట్లాడుతుంది. సౌర్య అలా మాట్లాడటంతో ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోతారు.