...

Singer Mangli: ఆమె నాకు అక్క కాదు అమ్మ… ఇండస్ట్రీని ఏలుతున్న అక్క చెల్లెలు!

Singer Mangli:సత్యవతి అంటే చాలామంది ఆమె ఎవరో అని ఆలోచిస్తారు కానీ అదే మంగ్లీ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు.మంగ్లీ గా అందరికీ ఎంతో సుపరిచితమైన ఈమె అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఒక తండా ప్రాంతానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటినుంచి చదువులో రాణిస్తూ,చదువులో ముందుకు కొనసాగిన మంగ్లీ పాటల పై ఆసక్తితో ఇలా సింగర్ గా మారిపోయారు.ఈ విధంగా ఈమె ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకోవడమే కాకుండా తన ఇద్దరి చెల్లెళ్ల బాధ్యతను తానే చూసుకున్నారు.

ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు పాటలతో ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా కొనసాగుతున్నారు. ఇలా మంగ్లీ సింగర్ గా ఎన్నో పాటలు పాడి గుర్తింపు సంపాదించుకోగా, తన చెల్లెలి ఇంద్రావతి మాత్రం కేవలం ఒకే ఒక పాటతో రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ద్వారా ఈమె ఎంతో గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇంద్రావతి మాట్లాడుతూ కేవలం తాను తన అక్క స్ఫూర్తితోనే పాటలను ఎంచుకున్నానని ప్రస్తుతం నేను ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం అక్కేనని తెలిపారు..

Singer Mangli:

మంగ్లీ తనకు అక్క కాదని తనకు అమ్మలాంటిదని ఈమె తన అక్క గురించి ఎంతో గొప్పగా చెప్పారు. తన చెల్లెలు గురించి కూడా మంగ్లీ మాట్లాడుతూ నేను 10 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్నగుర్తింపు తన చెల్లెలు కేవలం ఒక్క పాట ద్వారా మాత్రమే సంపాదించుకున్నారని తెలిపారు.చిన్నప్పటి నుంచి వారికి అన్ని నేనే చూసుకున్నానని అయితే వారికి ఇష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకోమని వారికి ఇష్టమైన మార్గంలోనే వారు పయనించాలని ఈమె కోరుకున్నారు. ఇక తన చెల్లికి ఒక్క పాటతోనే అంత మంచి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని ఈమె తెలిపారు.ఇక తన చెల్లెలకు తాను ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని కేవలం నేను పాటలు పాడుతూ ఉండడం వల్ల తను కూడా నాతో పాటు పాడుతూ పాటలపై మక్కువ పెంచుకుంది.ఇలా ఒకరోజు నాతోపాటు స్టూడియోకి రావడంతో ఆమెను దేవిశ్రీప్రసాద్ కలిసారని అలా తనకు అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా మంగ్లీ తన చెల్లెలు గురించి తెలిపారు.