Samantha Ruth Prabhu : పాన్ ఇండియా మూవీ పుష్పలో ఐటెం సాంగ్‌తో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రేంజ్ మారిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన లైఫ్ తనకు నచ్చినట్టుగా ఉంటోంది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఈ సామ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి యశోద, రెండోది శాకుంతలం.. ఇప్పుడు మరో మూవీ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన కాతువక్కుల రెండు కాదల్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ మూవీలో నయనతార, సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. మెయిన్ లీడ్ రోల్‌లో విజయ్ సేతపుతి నటిస్తున్నాడు. లేటెస్టుగా కాతువక్కుల రెండు కాదల్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది.
కామెడీ జోనర్‌లో విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడిన అబ్బాయికి వారితో జెర్నీ ఎలా ఉంటుందనే మూవీలో చూడాలి. ఈ ట్రైలర్‌లో నయనతార ఇద్దరూ కలిసి నటించారు. నయనతారతో సమంత చెప్పిన ఒక డైలాగ్ బాబోయ్.. ఎంత పచ్చిగా చెప్పేసిందో.. ఆ సీన్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగుతిన్నంత పనైంది.
సమంత నయనతారతో మాట్లాడుతూ.. నిన్ను పెళ్లి చేసుకున్నాడు.. నాతో పడుకున్నాడు అంటూ డైలాగ్ చెప్పడం.. తన అభిమానులకు బొత్తిగా నచ్చలేదట.. సమంత ఏంటి.. ఇలాంటి మాటలను అనేసింది అంటూ పాపం సామ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట.. సమంత చెప్పిన ఆ డైలాగ్ ఫుల్ వైరల్ అవుతోంది.
Read Also : Naa Aata Soodu : ఆ స్పెషల్ డేని కూడా వదలని ఈటీవీ మల్లెమాల.. మీ వాడకంకు దండంరా నాయన