Samantha: ప్రేమ అంటే ఓ గొప్ప అనుభూతి.. దానిని ఆస్వాదించాల్సిందే కానీ ఒకరు చెబితే అర్థం చేసుకోలేం. ప్రేమ మధురమైన జ్ఞాపకం.. అది చూడాల్సిందే కానీ పుస్తకాలు చదివితే అర్థం అయ్యేది కాదు. ప్రేమలో విజయం సాదించిన వారు ఒకలా.. ఫెయిల్ అయిన వారు మరోలా స్పందింస్తుంటారు ప్రేమ వ్యవహారం లేవనెత్తగానే. ఒక్కొక్కరి కోణం నుంచి లవ్ అనేది ఒక్కోలా కనిపిస్తుంది.
హీరోయిన్ సమంత గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. అటు తెలుగు, ఇటు తమిళం, మరో వైపు బాలీవుడ లోనూ సమంత తనదైన రీతిలో దూసుకుపోతోంది. అయితే సమంత ప్రేమలో పలు మార్లు ఫెయిల్ అయింది. ఒకసారి కాదు, రెండుసార్లు ప్రేమలో విఫలమైంది సమంత. అయితే సమంత ప్రేమ గురించి ఎలా ఆలోచిస్తోంది.. ప్రేమ పేరు ఎత్తగానే ఆమె ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలని సమంత అభిమానులు తెగ కోరుకుంటున్నారు.
అయితే ఈ డౌట్ ల గురించి సమంత రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది. తన రీసెంట్ ఫిల్మ్ KRK ప్రమోషన్ లో భాగంగా.. ట్విట్టర్ వేదికగా తన ఫ్యాన్స్ డౌట్స్ ను క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చింది. ఆస్క్ సామ్ పేరుతో తన ఫ్యాన్స్ తో చాట్ చేశారు. ఈ ప్రేమ, ద్వేషం లాంటి వాటిలో మళ్లీ పడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. వీటికి చాలా దూరంగా ఉండటం మంచిది అంటూ ఆఫ్టర్ బ్రేకప్ తనకు ప్రేమ మీదున్న అభిప్రాయాన్ని చెప్పేసింది సామ్.