వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Naa Aata Soodu : ఆ స్పెషల్‌ డేని కూడా వదలని ఈటీవీ మల్లెమాల.. మీ వాడకంకు దండంరా నాయన

Naa Aata Soodu : ఒకప్పుడు టీవీ చానల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు చాలా అరుదుగా మాత్రమే వచ్చేవి. చాలా స్పెషల్ పండుగలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమాలను టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేసేవి. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క పండుగ ను కూడా టెలివిజన్ ఛానల్స్ వాడుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సంక్రాంతి, ఉగాది, దసరా అని కాకుండా హోలీ శ్రీరామ నవమి ఇలా చిన్నచిన్న పండగలకి కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ టిఆర్పి ... Read more

By Ramesh Babu

Published on: April 26, 2022 9:03 PM

Updated on: April 26, 2022 10:57 PM

International Dance Day Event Naa Aata Soodu in ETV

---Advertisement---

Naa Aata Soodu : ఒకప్పుడు టీవీ చానల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు చాలా అరుదుగా మాత్రమే వచ్చేవి. చాలా స్పెషల్ పండుగలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమాలను టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేసేవి. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క పండుగ ను కూడా టెలివిజన్ ఛానల్స్ వాడుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సంక్రాంతి, ఉగాది, దసరా అని కాకుండా హోలీ శ్రీరామ నవమి ఇలా చిన్నచిన్న పండగలకి కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ టిఆర్పి రేటింగ్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

International Dance Day Event Naa Aata Soodu in ETV
International Dance Day Event Naa Aata Soodu in ETV

ఈ ప్రత్యేక కార్యక్రమాలలో ఈ టీవీ మల్లెమాల వారు ముందుంటున్నారు. మల్లెమాల జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్ ఈ ప్రత్యేక కార్యక్రమానికి రంగంలోకి దించుతున్నారు. చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైన.. చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా ఒకే ఎంటర్టైన్మెంట్ ని ఓ స్థాయిలో ఈటీవీ మల్లెమాల వారు ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడంలో నెంబర్వన్ అనిపించుకుంటున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా ఫుల్ గా వాడేస్తున్న ఈటీవీ మల్లెమాల వారు ఇప్పుడు మరో అరుదైన కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

ఏప్రిల్‌ 29వ తారీఖున అంతర్జాతీయ డాన్స్ దినోత్సవం. ఇప్పటి వరకు ఏ టెలివిజన్ వారు కూడా ఆ ప్రత్యేక సందర్భాన్ని తీసుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కానీ ఈ టీవీ మల్లెమాల వారు మాత్రం ఆ ప్రత్యేక రోజుని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం భారీ ఎత్తున నా ఆట చూడు అనే డాన్స్ షో ని నిర్వహించారు. మే 1వ తారీకున ఆ షో టెలికాస్ట్‌ కాబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు. జబర్దస్త్ యాంకర్ రష్మీ మరియు ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఇంకా పలువురు ప్రముఖులు ఈ ఇంటర్నేషనల్ డాన్స్ డే ప్రత్యేక కార్యక్రమం లో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఢీ డాన్స్ కార్యక్రమం తో సందడి చేస్తున్న ఈటీవీ ఈ కార్యక్రమం తో మరింతగా డాన్స్ ప్రియులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Also : Chiranjeevi : ‘ఆచార్య’ లో పవన్‌… చిరంజీవి వ్యాఖ్యలు వైరల్‌

, , , , , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel