Guppedantha Manasu Aug 15 Today Episode : తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సాక్షి వాళ్ళ అమ్మానాన్న దేవయాని ఇంటికి వస్తారు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు ఒకరికొకరు ఎదురుపడి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ బాధగా కనిపిస్తారు. అప్పుడు వసుధార అనుకోకుండా మెట్లు దిగుతూ కింద పడిపోతూ ఉండగా రిషి పట్టుకుంటాడు. అప్పుడు వసూ చేతిలో ఉన్న పూలదండ వారిద్దరి మెడలో పడుతుంది. ఆ తర్వాత తేరుకుని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Guppedantha Manasu Aug 15 Today Episode : కోపంతో రగిలిపోతున్న సాక్షి..?
మరొకవైపు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర జగతితో ఏంటి ఏం జరుగుతోంది అని అంటాడు. అప్పుడు జగతి కాలమే సమాధానం చెబుతుంది మహేంద్ర అని అంటుంది. అప్పుడు సాక్షిని బట్టలు మార్చుకోమని చెప్పగా వెంటనే దేవయాని వసుధార ని పిలిచి సాక్షిని రెడీ చేయమని చెబుతుంది. అప్పుడు ధరణి నేను వెళ్తాను అత్తయ్య అని అనగా వద్దులే వసు వెళ్తుంది అని చెబుతుంది.
ఆ తర్వాత సాక్షి, వసుతో పొగరుగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి వచ్చి సాక్షిని తీసుకొని వెళ్తుంది. మరొక వైపు రిషి దేవుడి వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జగతి సాక్షిని తీసుకొని వస్తూ ఉండగా అది చూసిన రిషి వసు వస్తున్నట్టుగా ఊహించుకుంటాడు. అప్పుడు సాక్షి వచ్చి రిషి పక్కన నిలబడగా ఇంతలో మహేంద్ర వచ్చి రిషి తీసుకుని వెళ్తాడు.
అప్పుడు సాక్షి జగతితో నేనే గెలిచాను అన్న విధంగా మాట్లాడగా వెంటనే జగతి నువ్వు భయపడకు ఎంగేజ్మెంట్ జరగదు అని చెబుతుంది. ఆ తర్వాత సాక్షి రిషి దగ్గరికి వెళ్లి నిలబడగా అప్పుడు రిషి కూర్చో వసు అని అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు సాక్షి కోపంతో రగిలి పోతుండగా దేవయాని నచ్చ చెబుతుంది.
అప్పుడు పూజారి ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకోమని అనగా రిషి సాక్షి చేతికి రింగు పెట్టబోతు ఉండగా ఆ రింగ్ మీద ఎస్ అని కాకుండా వి అనే లెటర్ ఉంటుంది. అది చూసిన సాక్షి పెద్ద గొడవ చేస్తుంది.రిషి ఏం చేస్తున్నాడో అర్థం కాక వసుధార ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. తన పేరు సాక్షి అయితే ఇక్కడ వి అని ఉంది అని సాక్షి కోపంగా అరవగా రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.