Guppedantha Manasu Aug 16 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గథ ఎపిసోడ్. లో ఉంగరం పై వి అనే లెటర్ చూసి సాక్షి నానారచ్చ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఉంగరం పై వి అనే అక్షరాన్ని చూసి సాక్షి రిషి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు రిషి కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు సాక్షి ఆ ఉంగరాన్ని అందరికీ చూపించడంతో అందరూ షాక్ అవుతారు. ఇక సాక్షి రింగు గురించి నానా రచ్చ చేస్తూ పెద్ద గొడవ చేస్తుంది. వసుధర అంటే నీకు ఇష్టం అందుకే వసుధార పేరు కలవరిస్తున్నావు అని అంటుంది.

sakshi-refuses-to-marry-rishi-in-todays-guppedantha-manasu-serial-episode
Guppedantha Manasu Aug 16 Today Episode : సంతోషంలో మహేంద్ర,గౌతమ్..
అప్పుడు రిషి ఏం జరిగింది సాక్షి ఎందుకు అలా అరుస్తున్నావ్ అని అనగా జరగకూడనిదే జరిగింది రిషి అంటూ ఫైర్ అవుతుంది. అప్పుడు రిషి ఏదో పొరపాటు జరిగింది సాక్షి అని అనగా అలా ఎలా జరుగుతుంది రిషి అంటూ గట్టిగా అరుస్తుంది సాక్షి. అప్పుడు దేవయాని కూడా సాక్షికి నచ్చజెప్పి ప్రయత్నం చేయగా వెంటనే సాక్షి దేవయానిపై ఫైర్ అవుతుంది.
ఆ తర్వాత సాక్షి దిశిని నానా మాటలు అనే రిషి ని మరింత బాధ పెడుతుంది. అప్పుడు రిషికి ప్రేమించడం రాదు అంటూ అందరి ముందు రిషి పరువు తీస్తుంది. అప్పుడు రిషి కోపంగా పెళ్లి ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంతే కానీ ఇలాంటి మాటలు మాట్లాడకు అని కోపంగా అనగా నీతో పెళ్లి, ఎంగేజ్మెంట్ వద్దు అంటూ సాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు దేవయాని తప్ప మిగిలిన అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత వసు ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు సాక్షి వసుకి ఎదురు వెళ్లి వసుని నాన్న మాటలు అంటుంది. అప్పుడు వసు సాక్షికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది. వారిద్దరి మాటలు రిషి చాటుగా వింటూ ఉంటాడు.
ఆ తర్వాత రిషి అక్కడికి వెళ్ళగా రిషికి ప్రేమించడం రాదు వసుధార కూడా నీకు దగ్గర కాదు అంటూ రిషిని నానా మాటలు అని గుడ్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాక్షి. అప్పుడు వసుధార కూడా రిషివైపు బాధగా చూస్తూ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రిషి దగ్గరికి మహేంద్ర వచ్చి సంతోషంతో మాట్లాడి రిషికి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత గౌతమ్, ధరణిని ఈ శుభ సందర్భంలో స్వీట్ చేయమని అడగగా ఇంతలో జగతి వచ్చి చేయమని చెబుతుంది. ఆ మాటలు విన్న దేవయాని అక్కడికి వచ్చి జగతి పై కోప్పడుతుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు బాధపడాల్సింది పోయి ఇలా పండగ చేసుకుంటారా అంటూ జగతి పై సీరియస్ అవుతుంది దేవయాని.
Read Also : Guppedantha Manasu Aug 15 Today Episode : ఎంగేజ్మెంట్ రింగు పై వసు పేరు.. కోపంతో రగిలిపోతున్న సాక్షి..?