RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ అభిమానులకు గుడ్‌న్యూస్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాపై హైకోర్టు పిల్ కొట్టివేసింది. అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే అల్లూరి, కొమురం భీంలను దేశభక్తులుగా చూపించామని దర్శక నిర్మాతలు కోర్టుకు విన్నవించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కల్పిత కథ మాత్రమేనని దర్శక నిర్మాతలు వాదించారు.
ఆర్ఆర్ఆర్ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని కోర్టుకు విన్నవించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ దాఖలు చేసిన పిల్ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఆర్ఆర్‌ఆర్ సినిమాతో అల్లూరి, కొమురం భీంల పేరు, ప్రఖ్యాతలకు ఎలాంటి భంగం కలగదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 25వ తేదీన (RRR movie Release on Mar 25) ప్రపంచవ్యాప్తంగా RRR మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌కు ఎలాంటి అడ్డుంకులు లేకుండా తొలగిపోయాయి..

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీలో.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నటించగా.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. బాలీవుడ్ నటి అలియా భట్ సీత పాత్రలో కనిపించగా.. అజయ్ దేవ్‌గన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఆర్ఆర్ఆర్ మూవీకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యహరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కావడానికి ముందే 8 వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట..
వరల్డ్ వైడ్ ఈ మూవీ రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు RRR మూవీ రాబోతోంది. RRR సినిమా ప్రమోషన్లు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. RRR మూవీ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదో చూడాలి.
Read Also : RRB Movie Budget : ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ అసలు ఎన్ని కోట్లుంటే?.. రాజమౌళి క్లారిటీ ఇచ్చాడుగా..!