RRB movie Budget : ఇప్పుడు అందరి చూపు.. ఆర్ఆర్ఆర్.. పైనే.. మార్చి 25న (RRR movie Release) ప్రపంచవ్యాప్తంగా జక్కన్న, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రానున్న RRR బొమ్మ పడబోతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని RRR అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరిలో ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ ఎంత అని.. టాలీవుడ్ మొత్తం ఇదే టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ మూవీ షూటింగ్ ప్రారంభంలో రూ.400 కోట్ల బడ్జెట్ అని నిర్మాత దానయ్య ప్రకటించారు.
కరోనా కారణంగా షూటింగ్ మరింత ఆలస్యం కావడంతో మూవీ బడ్జెట్ 400 కోట్ల బడ్జెట్ దాటి ఉంటుందిలే అనుకున్నారంతా.. లేదంటే రూ. 450 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు పెరిగి ఉండొచ్చునని అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు. వాస్తవానికి ఈ మూవీకి రాజమౌళి ఖర్చు చేసింది రూ. 400 కోట్లు కాదని చెప్పేశాడు.
మరి ఎంతంటే రూ. 550 కోట్లు అని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు.. RRR మూవీ మొత్తం బడ్జెట్ రూ. 550 కోట్లు అని రాజమౌళి ప్రకటించడంతో సినీవర్గాల్లో హట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో భారీ బడ్జెట్ పెట్టడంపై సినీవర్గాల్లో చర్చ మొదలైంది.
ఏదిఏమైనా నిర్మాతకు పోయేది ఏమి ఉండదులే అని అందరూ అనుకుంటున్నారు.. ఎందుకంటే సినిమా టేకఫ్ చేసింది జక్కన్న.. కదా.. ఆయన ఎంత చెక్కుతారో అంతే సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెడతారు.. ప్రపంచంలో రాజమౌళి సినిమాకు ఉన్న క్రేజ్ అంత ఉంటుంది. రాజమౌళి ఎంత ఖర్చు చేస్తాడో.. అంతకంటే రెట్టింపు స్థాయిలో ప్రాఫిట్ చూపిస్తాడని అభిప్రాయపడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కావడానికి ముందే 8 వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట.. వరల్డ్ వైడ్ ఈ మూవీ రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు RRR మూవీ రాబోతోంది. RRR సినిమా ప్రమోషన్లు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. RRR మూవీ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదో చూడాలి.
Read Also : RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన జీ 5… ఎన్ని కోట్లంటే?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world