RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన జీ 5… ఎన్ని కోట్లంటే?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని మార్చి 25 వ తేదీ ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి చిత్రబృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే ఒకసారి ప్రమోషనల్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించిన చిత్ర బృందం తాజాగా మరోసారి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.

సుమారు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక ఏ సినిమా అయినా థియేటర్ లో విడుదలైన తర్వాత ఆరు వారాలకు తప్పనిసరిగా ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా భారీ ఓటీటీ ధరలకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

అయితే కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఏకంగా 300 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా అన్ని సినిమాల మాదిరి ఆరు వారాలకు కాకుండా ఏకంగా 90 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, స్పానిష్‌ భాషలకు గాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel